TG: అప్పుడు డ్రగ్స్ కేసులో.. ఇప్పుడు అమ్మాయిల కేసులో
వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని అరెస్ట్.. మోసం చేశాడంటూ ఇద్దరు అమ్మాయిల ఫిర్యాదు....
వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేశాడంటూ ఇద్దరు అమ్మాయిలు చేసిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ప్రభాకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో తనను లొంగదీసుకున్నాడని బాధితులు ఫిర్యాదు చేశారు. గతంలో డ్రగ్ కేసులో.. ఇప్పుడు అమ్మాయిల మోసం చేశాడన్న ఆరోపలణలపై ప్రభాకర్ అరెస్టు అయ్యాడు.
గత ఏడాది డ్రగ్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. వారిలో ఒకరు వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి. మరొకరు డ్రగ్ డీలర్ అనురాధ. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ప్రభాకర్.. కష్టపడి టిఫిన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. గబ్చిబౌలి, డీఎల్ఎఫ్ వీధిలోని ఫుడ్ లేన్లతో పాటు హైదరాబాద్ నగరంలో 10కి పైగా బ్రాంచులను ఏర్పాటు చేశాడు. ఈ టిఫిన్ సెంటర్ల గురించి తెలియని హైదరాబాద్ వాసులుండరు. అక్కడ టిఫిన్‌కు అంత డిమాండ్. ఎప్పుడూ రష్ ఉండేది. కానీ అనూహ్యంగా డ్రగ్ కేసులో అరెస్టయ్యాడు ప్రభాకర్. కాగా, ఇటీవల బెయిల్ పై బయటకి వచ్చాడు. అంతలోనే మరో వివాదంలో చిచ్చుకున్నాడు. మరోసారి అతడ్ని అరెస్టు చేశారు పోలీసులు.
గచ్చిబౌలి పరిధిలోని డీఎల్‌ఎఫ్‌లో వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ పేరుతో చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. రుచి, నాణ్యత బాగుండటంతో ఆ టిఫిన్ సెంటర్ వద్దకు క్యూ కట్టారు నగర వాసులు. దీంతో వ్యాపారంలో లాభాలు రావడంతో.. హైదరాబాద్ నగరంలో వ్యాపారాన్ని విస్తరించాడు. పదో తరగతి కూడా చదువుకోని ప్రభాకర్ రెడ్డి.. తన తెలివితేటలతో వ్యాపారంలో కోట్లు గడించాడు. అన్ని ఫుడ్ డెలివరీ యాప్‌లలో వరలక్ష్మీ టిఫిన్ సెంటర్‌కు మంచి రేటింగ్ కూడా ఉంది. అలాంటిది ప్రభాకర్ జల్సాలకు అలవాటు పడ్డాడు. స్నేహితులతో కలిసి పబ్‌లకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం ప్రారంభమైంది. డ్రగ్స్‌కు, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు. పగలంతా వరలక్ష్మి టిఫిన్స్‌లో ఇడ్లీ, దోశ, వడ వంటి రుచికరమైన టిఫిన్స్ అమ్మే ప్రభాకర్‌రెడ్డి.. రాత్రిపూట డ్రగ్స్ దందా చేసే స్థాయికి ఎదిగాడు. అనురాధ ద్వారా గోవా నుంచి నగరానికి డ్రగ్స్ స్మగ్లింగ్ చేయించేవాడని తేలడంతో పోలీసులకు చిక్కాడు.
What's Your Reaction?