TG : ఆర్వోఆర్ చట్టంపై జిల్లాల్లో వర్క్ షాప్ : మంత్రి పొంగులేటి
ధరణి సమస్యలపై గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులతో పాటు ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన దరఖాస్తులను వచ్చే పదిరోజుల్లో పరిష్కరించాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, నూతన రెవెన్యూ చట్టం -2024 ముసాయిదా, ధరణి దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై సీఎస్ శాంతి కుమారి, జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న కొత్త ఆర్వోఆర్ యాక్ట్–2024పై ప్రజల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో ఆయా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై వివిధ రంగాల మేధావులతో వర్క్ షాప్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.

What's Your Reaction?