TG : కాంగ్రెస్ ఖాతాలో పాలమూరు డీసీసీబీ
మహబూబ్ నగర్ డీసీసీబీ చైర్మన్ గా మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం డీసీసీబీ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారి టైటాస్ పాల్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏకంగా 13 స్థానాలను గెలుచుకొని డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చైర్మన్ గా ఉన్న నిజాం పాషా అనారోగ్యానికి గురి కావడంతో.. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దాంతో చైర్మన్ ఎంపిక అనివార్యం అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మెజారిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. దీంతో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయ్యింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో.. సంబంధిత ఎన్నికల అధికారులు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా ఇద్దరు డైరెక్టర్లు మినహాయించి 11 మంది డైరెక్టర్లు ఎన్నికలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, అనిరుధ్, మేఘా రెడ్డి, మధుసూదన్ రెడ్డి, పర్ణికతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేసి, రైతు సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు.

What's Your Reaction?