TG : కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ వరద.. జూరాల 24 గేట్స్ ఓపెన్
కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు మళ్లీ వరద వస్తోంది. మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరగడంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 99 వేల క్యూసెక్కులు వస్తుండగా.. లక్షా 33 క్యూసెక్కుల నీటిని 24 గేట్లు ఎత్తి దిగువకు రిలీజ్ చేస్తున్నారు. భారీగా వరద వస్తుండటంతో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరో నాలుగు రోజుల పాటు వరద అలాగే కొనసాగే అవకాశం ఉందని డ్యాం అధికారులు అంచనా వేస్తున్నారు.
కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు మళ్లీ వరద వస్తోంది. మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా వరద పెరగడంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 99 వేల క్యూసెక్కులు వస్తుండగా.. లక్షా 33 క్యూసెక్కుల నీటిని 24 గేట్లు ఎత్తి దిగువకు రిలీజ్ చేస్తున్నారు. భారీగా వరద వస్తుండటంతో మొత్తం 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరో నాలుగు రోజుల పాటు వరద అలాగే కొనసాగే అవకాశం ఉందని డ్యాం అధికారులు అంచనా వేస్తున్నారు.
What's Your Reaction?