TG : నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి .. పేదల విద్యకు అడ్డుపడొద్దు

బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ క్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. ఆ స్కూల్ కూల్చకండి.పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించా. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.కత్తులతో దాడి చేయండి. పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని’ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. బండ్లగూడ మండలం సలాకం చెరువను ఓవైసీ బ్రదర్స్ ఆక్రమించారని బీజేపీ ఆరోపిస్తోంది. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ బండ్లగూడలోని సలాకం చెరువు దగ్గరలో ఉంది. చెరువును ఆక్రమించి కాలేజీ నిర్మించారని.. 2012, 2024లో సలాకం చెరువు ఎలా ఉండేదో చూడాలంటూ గూగుల్ మ్యాప్ ఫొటోలను సోషల్ మీడియాలో బీజేపీ పోస్ట్ చేసింది. ఆ కాలేజీని కూల్చివేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించింది..

Aug 29, 2024 - 08:10
 0  1

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News