TG : రాహుల్, రేవంత్ మధ్య విబేధాలు.. కేటీఆర్ సంచలన ఆరోపణ
రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రధాని తో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. అదానీ సంస్థల అక్రమాల పైన హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని తాము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. 10 సంవత్సరాల పాటు తమ మెడ మీద కత్తిపెట్టిన సరే అదానీని రాష్ట్రంలోకి రానివ్వలేదన్నారు. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియ్యలేదని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. 12వేల 400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడన్నారు. అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు కూర్చొని తేల్చుకొని తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రధాని తో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. అదానీ సంస్థల అక్రమాల పైన హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని తాము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.
10 సంవత్సరాల పాటు తమ మెడ మీద కత్తిపెట్టిన సరే అదానీని రాష్ట్రంలోకి రానివ్వలేదన్నారు. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియ్యలేదని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. 12వేల 400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడన్నారు.
అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు కూర్చొని తేల్చుకొని తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు.
What's Your Reaction?