TG : రుణమాఫీకి నోచుకోని రైతుల కోసం యాప్‌ : మంత్రి తుమ్మల

ప్రభుత్వం రుణమాఫీ చేసిన తర్వాత బ్యాంకులు కొత్త రుణాలను రూ. 10,400 కోట్ల మేర ఇచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట రుణం రెండు లక్షల లోపు ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో మాఫీ కాలేదన్నారు. రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలను తీసుకున్ని కొద్దిమందికి వారి బ్యాంకు ఖాతాల్లో మాఫీ డబ్బులు జమ కాలేదని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వ్యవసాయ అధికారుల దృష్టిలోనూ ఈ అంశం ఉన్నదని వివరించారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న 4,24,873 మంది రైతుల ఖాతాల వివరాలను సేకరించనున్నామని, వీటిని మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో రుణమాఫీలో టెక్నికల్ ఇబ్బందులపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రుణమాఫీ పథకాన్ని పంద్రాగస్టు నాటికే పూర్తి చేశామన్నారు. రెండు లక్షల రూపాయల్లోపు రుణం ఉన్నా, అన్ని వివరాలూ సక్రమంగా ఉన్నా మాఫీకి నోచుకోని రైతుల కోసం త్వరలో ఒక మొబైల్ యాప్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా రైతుల ఇండ్లకే వెళ్తారని, కొన్నిచోట్ల రైతు వేదికల దగ్గర ప్రత్యేక సమావేశం పెట్టి అభ్యంతరాలను స్వీకరిస్తారని తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ అధికారులకు మండలస్థాయిలో వచ్చిన ఫిర్యాదులను ఈ మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసి వీలైనంత తొందరగా పరిష్కరించడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

Aug 24, 2024 - 12:28
 0  1

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News