TG : రేపు రైతులతో బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రుణమాఫీ పూర్తి కాలేదని.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందడం లేదన్నారు. మంత్రివర్గ సహచరులు పూటకో మాట చెబుతున్నారని అనానారు. రైతులతో రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు ఆందోళన చేస్తామని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అయోమయానికి గురిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. అనేక ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే అందరికీ వ్యవసాయ రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని, అప్పటిదాకా ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. రైతులందరికీ వందశాతం రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పక్షాన రైతులతో కలిసి ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురిచేసే విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీని వెంటనే చేయాలని ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రుణమాఫీ పూర్తి కాలేదని.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ధర్నా నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందడం లేదన్నారు. మంత్రివర్గ సహచరులు పూటకో మాట చెబుతున్నారని అనానారు. రైతులతో రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు ఆందోళన చేస్తామని అన్నారు.
ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అయోమయానికి గురిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. అనేక ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే అందరికీ వ్యవసాయ రుణ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని, అప్పటిదాకా ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. రైతులందరికీ వందశాతం రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పక్షాన రైతులతో కలిసి ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురిచేసే విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీని వెంటనే చేయాలని ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
What's Your Reaction?