TG : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీజేపీ పొత్తు.. జగ్గారెడ్డి ఆరోపణలు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉండొచ్చని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ మంజూరు అయిందని ఆరోపించారు. కవితకు బెయిల్ వస్తుందని మూడు నాలుగు రోజుల నుంచే ప్రచారం చేస్తున్నారని అన్నారు. న్యాయమూర్తులు తీర్పు ఇవ్వకముందే వీళ్లు బెయిల్ వస్తుందని ఫిక్స్ అయిపోయారని అన్నారు. ఈ రెండు పార్టీలు ఎప్పటినుంచో ఒప్పందంలో ఉన్నాయని తెలిపారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డమ్మీ పాత్ర పోషించిందని విమర్శించారు. కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే బీఆర్ఎస్ అలా చేసిందన్నారు. కవిత బెయిల్ విషయంలో ఇది మరోసారి రుజువైందని చెప్పారు.

What's Your Reaction?