TG : హిండెన్‌బర్గ్‌ను సమర్థించడం దేశద్రోహమే : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హిండెన్ బర్గ్ భారత ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచాలని చూస్తోందని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న హిండెన్‌బర్గ్‌కు వత్తాసు పలుకుతున్నందుకు కాంగ్రెస్ పెద్దలంతా ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మండిపడ్డారు. హిండెన్‌బర్గ్‌ను కాంగ్రెస్ సమర్థించడం ముమ్మాటికీ దేశద్రోహమేనని గురువారం ఆయన ఒక ప్రకటన పేర్కొన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ విదేశీ సంస్థ హిండెన్‌బర్గ్‌కు మౌత్ పీసుగా మారిందని, ఇది ఆ పార్టీ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సెబీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు డిమాండ్ చేయడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని విరుచుకుపడ్డారు. గతేడాది కూడా హిండెన్ బర్గ్ ఇప్పటిలాగే భారత ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేసుకుని ఓ నివేదికను విడుదల చేసిందన్నారు. దాని ఆధారంగా కాంగ్రెస్ అప్పట్లో కూడా రాజకీయం చేయాలని చూసి భంగపడిందన్నారు. విదేశీయురాలైన సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఇండియన్ హెరాల్డ్ కేసులో బెయిల్ పై బయట తిరుగుతున్నారని పేర్కొన్నారు. పదేళ్లకు పైగా అధికారానికి దూరమైన గాంధీ కుటుంబానికి ఇక కనుచూపు మేరలో అధికారం వస్తుందన్న నమ్మకం లేకపోవడంతోనే ప్రధాని మోదీపై ఉన్న గుడ్డి వ్యతిరేకతతో ఇలా హిండెన్ బర్గ్ వంటి విదేశీ సంస్థలను నమ్ముకున్నారని చురకలంటించారు.

What's Your Reaction?