TGPSC | గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో నాన్ గెజిటెడ్ పోస్టులకు 31న సర్టిఫికెట్ వెరిఫికేషన్
TGPSC | గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో నాన్ గెజిటెడ్ కేటగిరీ సాధారణ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 31వ తేదీన నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఉదయం 10.30గం.లకు నిర్వహించనున్నట్లు కార్యదర్శి నవీన్ నికోలాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
TGPSC | హైదరాబాద్ : గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లో నాన్ గెజిటెడ్ కేటగిరీ సాధారణ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈ నెల 31వ తేదీన నాంపల్లిలోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఉదయం 10.30గం.లకు నిర్వహించనున్నట్లు కార్యదర్శి నవీన్ నికోలాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్స్ లింకు 30, 31తేదీల్లో అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్ధుల జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. అభ్యర్థులు చెక్‌లిస్ట్, అటెస్టెడ్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, దాని ఆధారంగా ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.
What's Your Reaction?