TGSRTC : రాఖీ పండుగ నాడు రికార్డ్ స్థాయిలో ఆర్టీసీ ప్రయాణాలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) రికార్డు స్థాయిలో 63.86 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేసింది. మహా లక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్క రోజులో 41.74 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నారు. 21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఆర్టీసీకి రూ. 32 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని చెప్పింది. ఆర్టీసీ చరిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడూ రాలేదన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించుకుందని, ఉద్యోగులు రాత్రి, పగలు నిరంతరం శ్రమించారనివారి సేవలను కొనియాడారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని రద్దీ ఉన్న రూట్లలో బస్సులు అదనంగా నడిపించి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యారన్నారు. రాఖీ పండగ ఉన్నప్పటికీ సిబ్బంది. నిరంతరం శ్రమించారని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా ఫీల్డ్ నే బస్సుల్లో వారి సోదరీ మణులు రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలిపారు.మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

Aug 23, 2024 - 11:18
 0  1
TGSRTC : రాఖీ పండుగ నాడు రికార్డ్ స్థాయిలో ఆర్టీసీ ప్రయాణాలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) రికార్డు స్థాయిలో 63.86 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేసింది. మహా లక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఒక్క రోజులో 41.74 లక్షల మంది మహిళలు వినియోగించుకున్నారు.

21.12 లక్షల మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఆర్టీసీకి రూ. 32 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని చెప్పింది. ఆర్టీసీ చరిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడూ రాలేదన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.

ఆర్టీసీ తన మొత్తం సామర్థ్యాన్ని ఉపయోగించుకుందని, ఉద్యోగులు రాత్రి, పగలు నిరంతరం శ్రమించారని

వారి సేవలను కొనియాడారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని రద్దీ ఉన్న రూట్లలో బస్సులు అదనంగా నడిపించి ప్రయాణికులను తరలించడంలో విజయవంతం అయ్యారన్నారు. రాఖీ పండగ ఉన్నప్పటికీ సిబ్బంది. నిరంతరం శ్రమించారని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా ఫీల్డ్ నే బస్సుల్లో వారి సోదరీ మణులు రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలిపారు.

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News