TGSWREIS | తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మెడిటేషన్ తరగతులు
TGSWREIS | తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో మెడిటేషన్ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు. విద్యార్థుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించి చదువుపై ఏకాగ్రతను పెంచేందుకు ఈ తరగతులు ఎంతో దోహదపడతాయని వివరించారు.
TGSWREIS | హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో మెడిటేషన్ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు. విద్యార్థుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించి చదువుపై ఏకాగ్రతను పెంచేందుకు ఈ తరగతులు ఎంతో దోహదపడతాయని వివరించారు. విద్యార్థులు ఒత్తిడితో ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
మెడిటేషన్ తరగతుల నిర్వహణ కోసం బ్రహ్మకుమారీస్ సంస్థతో సొసైటీ అవగాహన కుదుర్చుకుందని, ఇందులో భాగంగా గురుకుల టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఆ తర్వాత విద్యార్థుల మానసిక స్థితిని అంచనావేసి వారికి కేటగిరీలుగా విభజిస్తామని, వచ్చే నెల రెండోవారం నుంచి గురుకులాల్లో మెడిటేషన్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. వారంలో రెండుసార్లు ఈ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నామని, రెండు గంటల చొప్పున నిర్వహించే మెడిటేషన్ క్లాస్‌లో తొలిగంట విద్యకు సంబంధించి, రెండో గంట మానసిక వికాసానికి కేటాయిస్తామన్నారు.
ప్రతి గురుకులంలో ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు ఈ తరగతులకు హాజరవుతార్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ణానాన్ని గురుకుల విద్యార్థులకు అందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు కార్యదర్శి వివరించారు. ఇందుకోసం కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ సంస్థల వాలంటీర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేశామన్నారు. అదేవిధంగా నిర్మాణ్ సంస్థ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చిందన్నారు. ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు బేసిక్స్ అంశాలపై బోధన ఉంటుందని, తోమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ కోర్ సబ్జెక్టులపైనా ప్రాథమిక అంశాలతో పాటు ఆసక్తికి అనుగుణంగా మరింత లోతుగా బోధన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. లాంగ్వేజెస్‌తో పాటు పైథాన్ తదితర సాంకేతికతపైనా విద్యార్థులకు బేసిక్స్ నేర్పించనున్నట్లు వివరించారు. బదిలీలు, ప్రమోషన్లలో 89 చోట్ల తప్పులు జరిగాయి. వాటిని కూడా పరిష్కరిస్తున్నామని సెక్రటరి వెల్లడించారు.
What's Your Reaction?