Thalapathy Vijay :విజయ్ కీ తెలుగు ఆడియన్స్ అక్కర్లేదా..

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ లేటెస్ట్ మూవీ గోట్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఫుల్ ఫామ్. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. విజయ్ తో పాటు ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈమూవీ ట్రైలర్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా విజయ్ డ్యూయొల్ రోల్ లో అతన్ని చిన్న వయసు వాడిగా చూపించేందుకు చేసిన గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయనే కమెంట్స్ వచ్చాయి. అయితే వెంకట్ ప్రభు మాత్రం ఇది మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ మూవీ అంటున్నాడు. గోట్ తర్వాత హెచ్ వినోద్ డైరెక్షన్ లో మరో సినిమా చేసి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు విజయ్. అందుకే కోలీవుడ్ లో గోట్ పై భారీ అంచనాలున్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు మూవీ టీమ్ తో భారీగా ప్రమోషన్స్ కూడా చేయిస్తున్నారు మేకర్స్. ఇంత వరకూ బానే ఉన్నా.. తెలుగు ప్రేక్షకులను అస్సలు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి.విజయ్ కి తెలుగులో కూడా కొంత మార్కెట్ క్రియేట్ అయింది. అతన్ని అభిమానించేవాళ్లు ఇక్కడా చాలామందే ఉన్నారు. అదీ కాక ఇక్కడ మూవీని విడుదల చేసేవారికి కూడా లాభాలు పొందాలన్న కోరిక ఉంటుంది కదా. అందుకోసమైనా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయాలి. బట్ ఈ విషయంలో కోలీవుడ్ హీరోలు తెలుగు ఆడియన్స్ ను లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా కూడా ధనుష్ రాయన్ మూవీకి సంబంధించి ఇక్కడ జస్ట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో సినిమా బానే ఉన్నా.. తెలుగులో కొన్నవాళ్లు లాభాలు చూడలేకపోయారు. అదే తంగలాన్ విషయంలో రివర్స్ అయింది. వాళ్లు ఇక్కడ విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా రెండో వారానికి 150 థియేటర్స్ పెరిగాయి. దాని వల్ల తెలుగులో కొన్నాళ్లకు ప్లస్ అవుతుంది కదా. బట్ ఇప్పుడు విజయ్ గోట్ విషయంలో మళ్లీ రాయన్ సీన్ రిపీట్ అవుతోంది. ఇప్పుడున్న టైమ్ లో స్ట్రెయిట్ మూవీస్ నే పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక డబ్బింగ్ మూవీ అంటే పట్టించుకుంటారా. అందుకే ప్రమోషన్స్ చేయాలి. ఒకటికి పదిసార్లు ఈ మూవీ వస్తుందని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. అప్పుడే వర్కవుట్ అవుతుంది. ఎంత గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయినా.. రిలీజ్ టైమ్ లో ఎవరూ పట్టించుకోరు. 

Aug 29, 2024 - 22:00
Aug 29, 2024 - 22:09
 0  4
Thalapathy Vijay :విజయ్ కీ తెలుగు ఆడియన్స్ అక్కర్లేదా..

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ లేటెస్ట్ మూవీ గోట్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేది ఫుల్ ఫామ్. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. విజయ్ తో పాటు ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈమూవీ ట్రైలర్ కు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా విజయ్ డ్యూయొల్ రోల్ లో అతన్ని చిన్న వయసు వాడిగా చూపించేందుకు చేసిన గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయనే కమెంట్స్ వచ్చాయి. అయితే వెంకట్ ప్రభు మాత్రం ఇది మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ మూవీ అంటున్నాడు. గోట్ తర్వాత హెచ్ వినోద్ డైరెక్షన్ లో మరో సినిమా చేసి సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు విజయ్. అందుకే కోలీవుడ్ లో గోట్ పై భారీ అంచనాలున్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేయాలని చూస్తున్నారు. ఈ మేరకు మూవీ టీమ్ తో భారీగా ప్రమోషన్స్ కూడా చేయిస్తున్నారు మేకర్స్. ఇంత వరకూ బానే ఉన్నా.. తెలుగు ప్రేక్షకులను అస్సలు పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి.

విజయ్ కి తెలుగులో కూడా కొంత మార్కెట్ క్రియేట్ అయింది. అతన్ని అభిమానించేవాళ్లు ఇక్కడా చాలామందే ఉన్నారు. అదీ కాక ఇక్కడ మూవీని విడుదల చేసేవారికి కూడా లాభాలు పొందాలన్న కోరిక ఉంటుంది కదా. అందుకోసమైనా తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయాలి. బట్ ఈ విషయంలో కోలీవుడ్ హీరోలు తెలుగు ఆడియన్స్ ను లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా కూడా ధనుష్ రాయన్ మూవీకి సంబంధించి ఇక్కడ జస్ట్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో సినిమా బానే ఉన్నా.. తెలుగులో కొన్నవాళ్లు లాభాలు చూడలేకపోయారు. అదే తంగలాన్ విషయంలో రివర్స్ అయింది. వాళ్లు ఇక్కడ విపరీతంగా ప్రమోషన్స్ చేశారు. సినిమా టాక్ తో సంబంధం లేకుండా రెండో వారానికి 150 థియేటర్స్ పెరిగాయి. దాని వల్ల తెలుగులో కొన్నాళ్లకు ప్లస్ అవుతుంది కదా. బట్ ఇప్పుడు విజయ్ గోట్ విషయంలో మళ్లీ రాయన్ సీన్ రిపీట్ అవుతోంది. ఇప్పుడున్న టైమ్ లో స్ట్రెయిట్ మూవీస్ నే పెద్దగా పట్టించుకోవడం లేదు ప్రేక్షకులు. ఇక డబ్బింగ్ మూవీ అంటే పట్టించుకుంటారా. అందుకే ప్రమోషన్స్ చేయాలి. ఒకటికి పదిసార్లు ఈ మూవీ వస్తుందని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. అప్పుడే వర్కవుట్ అవుతుంది. ఎంత గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయినా.. రిలీజ్ టైమ్ లో ఎవరూ పట్టించుకోరు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News