Thandel : క్రిస్మస్ కు తండేలా.. పుష్పతో పోటీ ?
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో ఈ మూవీకి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సాయిపల్లవి, నాగచైతన్య కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. అంతకు ముందు లవ్ స్టోరీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. కార్తికేయ 2 వంటి జాతీయ అవార్డు విన్నింగ్ సినిమాకు దర్శకత్వం వహించిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. హైదరాబాద్ శివార్లలో శివుడికి సంబంధించిన కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్స్ లోని కొందరు ఆరిస్టులతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు నిర్మాత బన్నీ వాసు. దాదాపు 75 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. తండేల్ రిలీజ్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ పై ఆధారపడి ఉందని తెలుస్తోంది. డిసెంబర్ 20న వస్తే తండేల్ వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ గేమ్ ఛేంజర్ రాకుంటే క్రిసమస్ కానుకగా తండేల్ ను తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేకర్స్. కొందరు జాలర్లు అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర భాగంలో చిక్కుకుని అక్కడ ఎదుర్కున్న ఇబ్బందులే ఇతి వృత్తంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

What's Your Reaction?