Thane Horror : థానేలో దారుణం.. నర్సరీ చిన్నారులపై స్వీపర్ లైంగికదాడి

మహారాష్ట్ర థానేలో చిన్నారులపై స్వీపర్ ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బద్లాపూర్ లోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీనికి నిరసనగా స్థానికులు భారీగా ఆందోళనలు చేపట్టారు. థానే నగరమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్లపై ఆందోళనకారుల నిరసనతో రైళ్లు నిలిచిపోయాయి. అడ్డుకున్న పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగస్టు 16న బదాపుర్లోని పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపులు జరిగాయి. ఇద్దరు చిన్నారులు టాయిలెట్లో ఉన్న టైంలో.. దాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ వారి దగ్గరకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. బాధిత బాలిక ఒకరు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో చిన్నారి స్కూల్ కు వెళ్లాలంటే భయపడటంతో ఈ వ్యవహారం బయటపడింది. డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది. బదాపూర్ లో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సీఎం ఏకనాథ్ షిండే చెప్పారు.

Aug 23, 2024 - 11:18
 0  1
Thane Horror : థానేలో దారుణం.. నర్సరీ చిన్నారులపై స్వీపర్ లైంగికదాడి

మహారాష్ట్ర థానేలో చిన్నారులపై స్వీపర్ ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బద్లాపూర్ లోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీనికి నిరసనగా స్థానికులు భారీగా ఆందోళనలు చేపట్టారు. థానే నగరమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రైల్వే ట్రాక్లపై ఆందోళనకారుల నిరసనతో రైళ్లు నిలిచిపోయాయి. అడ్డుకున్న పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగస్టు 16న బదాపుర్లోని పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపులు జరిగాయి. ఇద్దరు చిన్నారులు టాయిలెట్లో ఉన్న టైంలో.. దాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ వారి దగ్గరకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు.

బాధిత బాలిక ఒకరు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో చిన్నారి స్కూల్ కు వెళ్లాలంటే భయపడటంతో ఈ వ్యవహారం బయటపడింది. డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది. బదాపూర్ లో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సీఎం ఏకనాథ్ షిండే చెప్పారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News