Thangalaan : సెకండ్ వీక్ స్ట్రాంగ్ గా మారిన తంగలాన్.. థియేటర్స్ పెరిగాయి
మౌత్ టాక్ కు ఉండే పవర్ సినిమావాళ్లకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఒక సినిమా రేంజ్ ను, హిట్టూ, ఫ్లాపును కూడా మౌత్ టాక్ డిసైడ్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆశ్చర్యంగా రెండు రకాల టాక్స్ వల్ల కూడా లాభపడుతున్న సినిమా తంగలాన్. పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి హిట్ టాక్ ఎక్కువగా ఉంది. ఫ్లాప్ టాక్ కూడా అలాగే ఉంది. దాని వల్లే ఇప్పుడు తంగలాన్ రేంజ్ మారింది. ఈ సినిమాకు ఎన్ని ప్రశంసలు వచ్చాయో.. అన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయినా విమర్శంచేవాళ్లూ చూస్తున్నారు. ప్రశంసించేవాళ్లూ చూస్తున్నారు. రెండు రకాలుగానూ ప్రేక్షకుల నోళ్లలో నానుతూ వస్తోందీ సినిమా. దీంతో ఇరువైపుల వాళ్లూ ఒక్కసారి చూడాలి అని ఫిక్స్ అవుతున్నారు.తెలుగులో కూడా తంగలాన్ ను భారీగా ప్రమోషన్స్ చేశారు. ఇక్కడా రెండు వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే తమిళనాడులో ఈ మూవీ రేంజ్ ఈ కారణంగానే పెరిగింది. ఇప్పుడు తెలుగులో కూడా అదే జరిగింది. సోషల్ మీడియా వేదికగా తంగలాన్ నిరంతరం చర్చల్లోనే ఉంటుంది. సినిమా వాదం ఏదైనా ఆర్టిస్టుల నటన కోసం కూడా మళ్లీ మళ్లీ చూస్తున్నవాళ్లూ ఉన్నారు. తెలుగులో మామూలుగా విక్రమ్ సినిమాలకు భిన్నంగా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చుకుందీ మూవీ. అయితే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. ఇక టాక్ వల్ల సెకండ్ వీక్ కు వచ్చేసరికి ఏకంగా 140 థియేటర్స్ పెరిగాయి. ఈ విషయాన్ని మేకర్సే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ వారం తెలుగులో మరింత స్ట్రాంగ్ గా మారింది తంగలాన్. ఒక్క నైజాంలోనే థియేటర్స్ డబుల్ అయ్యాయి. ఫస్ట్ వీక్ లో నైజాంలో 95 థియేటర్స్ లో రిలీజ్ అయితే రెండో వారానికి ఆ సంఖ్య 185కి మారింది. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లో థియేటర్స్ సంఖ్య చాలా పెరిగింది. దీంతో ఫస్ట్ వీక్ 250 థియేటర్స్ లో విడుదలైన తంగలాన్.. సెకండ్ వీక్ లో 391 థియేటర్స్ కు పెరిగింది. సో.. తంగలాన్ కోసం తెలుగులో మేకర్స్ చేసిన మార్కెట్ తో పాటు మౌత్ టాక్ కూడా బలంగా పనిచేసిందనే చెప్పాలి. అంటే కమర్షియల్ గానూ ప్రాఫిటబుల్ కాబోతందనే కదా అర్థం.
మౌత్ టాక్ కు ఉండే పవర్ సినిమావాళ్లకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఒక సినిమా రేంజ్ ను, హిట్టూ, ఫ్లాపును కూడా మౌత్ టాక్ డిసైడ్ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆశ్చర్యంగా రెండు రకాల టాక్స్ వల్ల కూడా లాభపడుతున్న సినిమా తంగలాన్. పా. రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి హిట్ టాక్ ఎక్కువగా ఉంది. ఫ్లాప్ టాక్ కూడా అలాగే ఉంది. దాని వల్లే ఇప్పుడు తంగలాన్ రేంజ్ మారింది. ఈ సినిమాకు ఎన్ని ప్రశంసలు వచ్చాయో.. అన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయినా విమర్శంచేవాళ్లూ చూస్తున్నారు. ప్రశంసించేవాళ్లూ చూస్తున్నారు. రెండు రకాలుగానూ ప్రేక్షకుల నోళ్లలో నానుతూ వస్తోందీ సినిమా. దీంతో ఇరువైపుల వాళ్లూ ఒక్కసారి చూడాలి అని ఫిక్స్ అవుతున్నారు.
తెలుగులో కూడా తంగలాన్ ను భారీగా ప్రమోషన్స్ చేశారు. ఇక్కడా రెండు వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే తమిళనాడులో ఈ మూవీ రేంజ్ ఈ కారణంగానే పెరిగింది. ఇప్పుడు తెలుగులో కూడా అదే జరిగింది. సోషల్ మీడియా వేదికగా తంగలాన్ నిరంతరం చర్చల్లోనే ఉంటుంది. సినిమా వాదం ఏదైనా ఆర్టిస్టుల నటన కోసం కూడా మళ్లీ మళ్లీ చూస్తున్నవాళ్లూ ఉన్నారు. తెలుగులో మామూలుగా విక్రమ్ సినిమాలకు భిన్నంగా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చుకుందీ మూవీ. అయితే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. ఇక టాక్ వల్ల సెకండ్ వీక్ కు వచ్చేసరికి ఏకంగా 140 థియేటర్స్ పెరిగాయి. ఈ విషయాన్ని మేకర్సే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ వారం తెలుగులో మరింత స్ట్రాంగ్ గా మారింది తంగలాన్.
ఒక్క నైజాంలోనే థియేటర్స్ డబుల్ అయ్యాయి. ఫస్ట్ వీక్ లో నైజాంలో 95 థియేటర్స్ లో రిలీజ్ అయితే రెండో వారానికి ఆ సంఖ్య 185కి మారింది. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లో థియేటర్స్ సంఖ్య చాలా పెరిగింది. దీంతో ఫస్ట్ వీక్ 250 థియేటర్స్ లో విడుదలైన తంగలాన్.. సెకండ్ వీక్ లో 391 థియేటర్స్ కు పెరిగింది. సో.. తంగలాన్ కోసం తెలుగులో మేకర్స్ చేసిన మార్కెట్ తో పాటు మౌత్ టాక్ కూడా బలంగా పనిచేసిందనే చెప్పాలి. అంటే కమర్షియల్ గానూ ప్రాఫిటబుల్ కాబోతందనే కదా అర్థం.
What's Your Reaction?