తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Jan 9, 2025 - 08:59
Jan 9, 2025 - 09:04
 0  66
తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాటలు చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను.

అదే విధంగా మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్ళి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. -/(పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News