Tirumala Water Shortage : తిరుమలలో నీళ్లు లేవు.. టీటీడీ విచిత్ర నిర్ణయం

తిరుమలలో నీటి కష్టాలు మొదలయ్యాయి. తిరుమల కొండపై భక్తులు, స్థానికులు నీటిని పొదుపుగా వాడాలని TTD బోర్డు కోరింది. అందుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ ప్రాంతానికి ఇకపై 6 రోజులకు ఒకసారి నీటి సరఫరా ఉంటుందని తెలిపింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ లకు ఇకపై 24 గంటల నీటి సరఫరా ఉండదని, రోజులో ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఆగస్టు 25 నుంచి ఇది అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.సరఫరా చేస్తున్న నీరు సరిపోకపోతే తిరుపతి నుంచి ట్యాంకర్ల తో వాటర్‌ తెప్పించుకోవాలంటోంది. ఇక తిరుమల కొండపై దాతల సహాయంతో నిర్మిస్తున్న కాటేజీలకు నీటి సరఫరా చేయలేమని టీటీడీ తెలిపింది. నిర్మాణ పనుల కోసం తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకోవాలని సూచించింది. ఇందుకోసం విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తిరుమలలో స్థానికులు, యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వివరించింది. నీటిని అనవసరంగా వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని భక్తులకు, స్థానికులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Aug 23, 2024 - 11:15
 0  1
Tirumala Water Shortage : తిరుమలలో నీళ్లు లేవు.. టీటీడీ విచిత్ర నిర్ణయం

తిరుమలలో నీటి కష్టాలు మొదలయ్యాయి. తిరుమల కొండపై భక్తులు, స్థానికులు నీటిని పొదుపుగా వాడాలని TTD బోర్డు కోరింది. అందుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ ప్రాంతానికి ఇకపై 6 రోజులకు ఒకసారి నీటి సరఫరా ఉంటుందని తెలిపింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ లకు ఇకపై 24 గంటల నీటి సరఫరా ఉండదని, రోజులో ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు మాత్రమే నీటి సరఫరా ఉంటుందని టీటీడీ పేర్కొంది. ఆగస్టు 25 నుంచి ఇది అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

సరఫరా చేస్తున్న నీరు సరిపోకపోతే తిరుపతి నుంచి ట్యాంకర్ల తో వాటర్‌ తెప్పించుకోవాలంటోంది. ఇక తిరుమల కొండపై దాతల సహాయంతో నిర్మిస్తున్న కాటేజీలకు నీటి సరఫరా చేయలేమని టీటీడీ తెలిపింది. నిర్మాణ పనుల కోసం తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించుకోవాలని సూచించింది.

ఇందుకోసం విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తిరుమలలో స్థానికులు, యాత్రికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వివరించింది. నీటిని అనవసరంగా వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని భక్తులకు, స్థానికులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News