Tovino Thomas ARM : దూసుకొస్తున్న టోవినో థామస్
మళయాల నటుడు టోవినో థామస్ ఏం చేసినా కొత్తగా ప్రయత్నిస్తుంటాడు. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటాడు. 2021లో మిన్నల్ మురళి అనే ప్యాన్ ఇండియన్ మూవీతో అదరగొట్టిన టోవినో ఈ సారి 'ఏ.ఆర్.ఎమ్' అంటూ వస్తున్నాడు. జితిన్ లాల్ దర్శకుడు. క్లుప్తంగా చూస్తే ఆర్మ్ అనిపిస్తుంది. బట్ ఈ టైటిల్ కు ఇంకేదైనా ప్రత్యేకమైన అర్థం ఉంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ మూవీని కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. లేటెస్ట్ గా ఏఆర్ఎమ్ ట్రైలర్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. మూడు భిన్నమైన కాలాల నేపథ్యంలో తన వంశ పారంపర్యం గురించి చెప్పే కథలా ఉంది. బ్రిటీష్ కాలం నుంచి నేటి కాలం వరకూ సాగే కథలా ఉంది. ఈ మూడు కాలాల్లోనూ తనే నటించాడు. ఆ పాత్రలకు మళయాలంలో మణియన్, అజయన్, కుంజికేళు అనే పాత్రల్లో కనిపించబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ మూడు పాత్రలకూ ముగ్గురు హీరోయిన్లున్నారు. ఐశ్వర్య లక్ష్మి, కృతిశెట్టి, సురభి లక్ష్మి ఆ పాత్రల్లో నటించారు. కలరి యుద్ధంలో ఎక్స్ పర్ట్ అయిన యువకుడుగా మొదటి దశలో కనిపించాడు టోవినో. ఆ కళనే మూడు పాత్రలకూ చూపించినట్టున్నారు. ఓ ప్యాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. మళయాల నేపథ్యమే అయినా మేకింగ్ పరంగా అద్భుతం అనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.కొన్నాళ్లుగా సౌత్ ఇండియన్ హీరోలే ప్యాన్ ఇండియన్ స్టార్స్ గా వెలుగుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రీసెంట్ గా రిషబ్ శెట్టి కూడా ఆ జాబితాలో చేరారు. ఈ ట్రైలర్ చూస్తుంటే టోవినో థామస్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ గా దూసుకువస్తున్నాడు అనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ లో విడుదల అన్నారు కానీ కరెక్ట్ డేట్ వేయలేదు. మరి ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
మళయాల నటుడు టోవినో థామస్ ఏం చేసినా కొత్తగా ప్రయత్నిస్తుంటాడు. వైవిధ్యమైన కథలతో ఆకట్టుకుంటాడు. 2021లో మిన్నల్ మురళి అనే ప్యాన్ ఇండియన్ మూవీతో అదరగొట్టిన టోవినో ఈ సారి 'ఏ.ఆర్.ఎమ్' అంటూ వస్తున్నాడు. జితిన్ లాల్ దర్శకుడు. క్లుప్తంగా చూస్తే ఆర్మ్ అనిపిస్తుంది. బట్ ఈ టైటిల్ కు ఇంకేదైనా ప్రత్యేకమైన అర్థం ఉంటే సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ మూవీని కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. లేటెస్ట్ గా ఏఆర్ఎమ్ ట్రైలర్ తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. మూడు భిన్నమైన కాలాల నేపథ్యంలో తన వంశ పారంపర్యం గురించి చెప్పే కథలా ఉంది. బ్రిటీష్ కాలం నుంచి నేటి కాలం వరకూ సాగే కథలా ఉంది. ఈ మూడు కాలాల్లోనూ తనే నటించాడు. ఆ పాత్రలకు మళయాలంలో మణియన్, అజయన్, కుంజికేళు అనే పాత్రల్లో కనిపించబోతున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ మూడు పాత్రలకూ ముగ్గురు హీరోయిన్లున్నారు. ఐశ్వర్య లక్ష్మి, కృతిశెట్టి, సురభి లక్ష్మి ఆ పాత్రల్లో నటించారు. కలరి యుద్ధంలో ఎక్స్ పర్ట్ అయిన యువకుడుగా మొదటి దశలో కనిపించాడు టోవినో. ఆ కళనే మూడు పాత్రలకూ చూపించినట్టున్నారు.
ఓ ప్యాన్ ఇండియా సినిమాకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. మళయాల నేపథ్యమే అయినా మేకింగ్ పరంగా అద్భుతం అనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది.కొన్నాళ్లుగా సౌత్ ఇండియన్ హీరోలే ప్యాన్ ఇండియన్ స్టార్స్ గా వెలుగుతున్నారు. ఇప్పటికే ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రీసెంట్ గా రిషబ్ శెట్టి కూడా ఆ జాబితాలో చేరారు. ఈ ట్రైలర్ చూస్తుంటే టోవినో థామస్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ గా దూసుకువస్తున్నాడు అనిపిస్తోంది. ఇక సెప్టెంబర్ లో విడుదల అన్నారు కానీ కరెక్ట్ డేట్ వేయలేదు. మరి ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
What's Your Reaction?