తిరుపతిలో విషాద ఘటన-వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలోతొక్కిసలాట
తిరుపతిలో విషాద ఘటన-వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలోతొక్కిసలాట పలువురికి గాయాలు
తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితోపాటు మరో ముగ్గురు భక్తులు మృతి చెందారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. గురువారం, డిసెంబర్ 9 తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
దీంతో బుధవారం సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ క్యూలైన్లలో బారులు తీరారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు భారీగా రావడంతో క్యూలైన్లలో తోపులాట జరిగింది. దీంతో భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకోవడంతో నలుగురు భక్తులు మృతి చెందారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా గురువారం నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు ఒకరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించేందుకు మెయిన్ గేట్ ఓపెన్ చేశారు.
What's Your Reaction?