TSPSC: గురుకులపీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

ఏళ్ల నిరీక్షణకు తెర... 594 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

Aug 23, 2024 - 11:17
 0  1
TSPSC: గురుకులపీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల..

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రోవిజినల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వెబ్ సైట్ లో జాబితాను పొందుపరిచింది. ఉద్యోగంలో చేరడం ఇష్టం లేని అభ్యర్థులు రిలీక్వెష్మెంట్ ఇస్తే… తరవాత స్థానాల్లో ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 594 పోస్ట్ లకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోర్టల్ లో పోటీ పడిన అభ్యర్థులు చూడొచ్చు.

సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017లో తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో మైనార్టీ గురుకులాల్లో 194, ఎస్సీ గురుకులాల్లో 182, బీసీ గురుకులాల్లో 135, గిరిజన గురుకుల సొసైటీలో 83, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు పూర్తయ్యాయి. కానీ.. విద్యార్హతలు, సాంకేతిక కారణాలతో న్యాయ వివాదాలు తలెత్తాయి. ఆ వివాదాలన్నింటినీ కమిషన్ పరిష్కరించింది. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను ప్రకటించింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందే అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ఆప్షన్లు తీసుకుంది. ఆ ఆప్షన్ల ప్రకారం.. తుది ఫలితాలు వెల్లడించింది. ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తి చేసింది. గురుకుల సొసైటీ నియామకాల్లో జరిగిన పొరపాట్లు.. ఇతర నోటిఫికేషన్లలో తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఏపీలో గ్రూప్‌ వన్‌ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా చేసినట్టు తెలిపింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 81 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో మొత్తం 1,48, 881 మంది ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 4,496 మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News