TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అలెర్ట్
TTD: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అలెర్ట్
ఇక తిరుమలలో భారీ వర్షాలకు రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అలెర్ట్. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ క్రమంలో టీటీడీ పాలక మండలి పాపవినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది. ఇక అటు తిరుమలలో ఉన్న గోగర్భం జలాశయం కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడు సెంటిమీటర్ల మేర గేట్లు ఎత్తారు.
తిరుమల భక్తులు సహకరించాలని టీటీడీ పాలక మండలి అధికారులు కోరడం జరిగింది. వర్షం కారణంగాల తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ అధికారులు తెలిపారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోందని చెప్పారు. ఇక, శనివారం 73,619 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 25,112మంది భక్తులు తలనీలాలు సమర్పించారని, స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.35 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.
What's Your Reaction?