TTD : తిరుమల భక్తులకు టీటీడీ షాక్
కలియుగ ప్రత్యక్ష్య దైవం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి తర్వాత అందరి గుర్తుకొచ్చేది లడ్డూనే. తిరుపతి లడ్డూకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. శతాబ్దాల నుంచి తిరుపతి లడ్డుకి ఉన్న క్రేజ్ ప్రపంచంలో మరే ఇతర తీపి పదార్థానికి లేదంటే అతిశయోక్తి లేదు. తిరుపతి వెళ్తున్నాం అని ఎవరికైనా చెప్తే వస్తూ మాకు కూడా లడ్డూలు తీసుకురండి అని అడుగుంటారు. మన నాయకులు ఢిల్లీకో లేదా విదేశీ నేతలను కలవడానికి కలవడానికి వెళ్లినప్పుడు వారి కోసం తిరుపతి లడ్డూని కూడా తీసుకెళ్తారు. అంత ప్రాముఖ్యత కలిగిన తిరుపతి లడ్డూ విషయంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భక్తులకు షాకింగ్ గా మారింది. టీటీడీ కొత్త రూల్స్ ప్రకారం... శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు దర్శన టికెట్‌పై ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అంతకు ముందు దర్శన టోకెన్‌పై ఒక భక్తునికి రెండు లడ్డూలు ఇచ్చేవారు. ప్రస్తుతం మాత్రం ఒక్క లడ్డూనే ఇవ్వనున్నారు. ఆధార్ కార్డు చూపిస్తే మరో లడ్డు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఒక్కసారి లడ్డూ తీసుకుంటే నెల రోజుల వరకు లడ్డూ పొందే అవకాశం లేదని కౌంటర్ సిబ్బంది అంటున్నట్లు సమాచారం. టీటీడీ నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ తరహా ఆంక్షలు సరికాదని అంటున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఈ విధానం అమలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. లడ్డూ ఆంక్షలపై టీటీడీ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

What's Your Reaction?