US Open 2024 | పదహారేండ్లకే గ్రాండ్‌స్లామ్‌లో బోణీ.. ఎవరీ ఇవా జోవిక్..?
US Open 2024 : ప్రపంచ టెన్నిస్‌లో అమెరికాది ప్రత్యేక స్థానం. ఆ దేశం నుంచి ఎందరో మహిళా టెన్నిస్ స్టార్లు పుట్టుకొచ్చారు. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్(US Open 2024)లో అమెరికా యువకెరటం ఇవా జోవిక్(Iva Jovic) బోణీ కొట్టింది. 16 ఏండ్ల వయసులోనే తొలి విజయాన్ని రుచి చూసింది.
US Open 2024 : ప్రపంచ టెన్నిస్‌లో అమెరికాది ప్రత్యేక స్థానం. ఆ దేశం నుంచి ఎందరో మహిళా టెన్నిస్ స్టార్లు పుట్టుకొచ్చారు. విలియమ్స్ సిస్టర్స్ (Williams Sisters) తర్వాత టీనేజర్ కొకో గాఫ్(Coco Gauff) గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో అమెరికా పేరును గట్టిగా వినిపించేలా చేశారు. ఇప్పుడు వీళ్ల అడుగు జాడల్లోనే ఓ టీనేజర్ దూసుకొస్తోంది. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్(US Open 2024)లో అమెరికా యువకెరటం ఇవా జోవిక్(Iva Jovic) బోణీ కొట్టింది.
పదహారేండ్ల వయసులోనే తొలి విజయాన్ని రుచి చూసింది. తద్వారా 24 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ మెయిన్ డ్రాలో గెలుపొందిన తొలి అమెరికన్‌గా జోవిక్ చరిత్ర సృష్టించింది. అరంగేట్రం గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్‌లో విజేతగా నిలిచిని ఈ యంగ్‌స్టర్ అమెరికా భావి టెన్నిస్ తారగా ప్రశంసలు అందుకుంటోంది.
యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో జోవిక్ అదరగొట్టింది. పోలాండ్‌కు చెందిన మగ్డ లినెట్టె (Magda Linette)ను 6-4, 6-3తో చిత్తుగా ఓడించింది. గంట 28 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జోవిక్ ప్రత్యర్థిని అలవోకగా మట్టికరిపించింది. ఈ విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన ఆమె టెన్నిస్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం.
Dream debut for Iva Jovic
Tags:
What's Your Reaction?