US President Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఈ ఏడు రాష్ట్రాలే కీలకం..!

US Presidential Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సుమారు 24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే, ఏడు కీలక రాష్ట్రాల్లోని కొద్ది మంది ఓటర్లు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో కీలకం కానున్నారని తెలుస్తున్నది.

Aug 27, 2024 - 20:58
 0  5
US President Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఈ ఏడు రాష్ట్రాలే కీలకం..!
Donaldtrumpkamalaharris

US President Elections | వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సుమారు 24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే, ఏడు కీలక రాష్ట్రాల్లోని కొద్ది మంది ఓటర్లు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో కీలకం కానున్నారని తెలుస్తున్నది. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో తదుపరి అధ్యక్షుడి ఎన్నికల్లో అరిజోవా, జార్జియా, మిషిగాన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విష్కాన్సిన్ రాష్ట్రాల ఓటర్లు కీలకంగా మారారు. ఇరువురి ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఈ ఏడు రాష్ట్రాల్లో ఇంకా తటస్థంగా ఉన్న ఓటర్ల మనస్సులు చూరగొనడంపైనే ఇరువురు నేతలు ఫోకస్ చేశారని తెలుస్తున్నది.

2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన అరిజోవా మరోమారు ప్రధాన భూమిక పోషిస్తుంది. సంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్న అరిజోవా రాష్ట్ర ఓటర్లు గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి ఓటేశారు. 1990 నుంచి అరిజోవా ఓటర్లు డెమోక్రటిక్ పార్టీకి మద్దతు తెలుపడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ అరిజోవా కీలకం కానున్నది.

మెక్సికోతో సుదీర్ఘ సరిహద్దు గల అరిజోవాలో ఇమ్మిగ్రేషన్ ప్రధాన అంశంగా ఉంది. తనను గెలిపిస్తే భారీ స్థాయిలో అక్రమ వలసదారులను వారి స్వదేశానికి పంపించడానికి ఆపరేషన్ చేపడతానని ట్రంప్ హామీ ఇస్తున్నారు. జో బైడెన్ హయాంలో సరిహద్దు సంక్షోభం పరిష్కారంలో కీలకంగా పని చేసిన కమలా హరిస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అరిజోవాలో మరో వివాదాస్పద సమస్య అబార్షన్లు. రిపబ్లికన్లు తమకు అధికారం ఇస్తే 160 ఏండ్ల నాటి నిషేధం అమల్లోకి తెస్తామని హామీ ఇస్తున్నారు. 2022లో అబార్షన్ కు గల రాజ్యాంగ హక్కును యూఎస్ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది.

ఇక జార్జియాలో ఆఫ్రికన్ అమెరికన్ పౌరులు భారీగా ఉన్నారు. 2020 ఎన్నికల్లో జో బైడెన్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. గత రెండు ఎన్నికల్లో అధ్యక్షుడి ఎన్నికలో కీలకంగా మారిన మరో రాష్ట్రం మిషిగాన్. ఇజ్రాయెల్ కు బైడెన్ మద్దతు తెలుపడంపై జాతీయ స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. మిషిగాన్ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు అరబ్ అమెరికన్లే. భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించినా, ఆర్థిక వృద్ధిరేటు నెవడా రాష్ట్ర ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా ఉంది. పన్నులు తగ్గిస్తానని, నియంత్రణలు తగ్గిస్తామని ట్రంప్ హామీ ఇస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం నార్త్ కరోలినా ఓటర్లను ఆలోచింప చేస్తున్నది. భారీగా ద్రవ్యోల్బణం పెరగడం పెన్సిల్వేనియా ఓటర్లను ఆలోచింప చేస్తున్నది. 2016,2020 ఎన్నికల్లో కీలకంగా ఉన్న విస్కాన్సిన్ రాష్ట్రం నుంచి గ్రీన్ పార్టీ పోటీలో ఉండటం డెమోక్రటిక్ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News