Vetrimaaran : ఆ విప్లవకారుడు వచ్చేది అప్పుడే

కోలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లో విడుదలై 2 ఒకటి. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ పార్ట్ లో మోస్ట్ వాంటెడ్ రెబల్ అయిన విజయ్ ని పట్టుకోవడానికి ఒక పోలీస్ బెటాలియనే క్యాంప్ వేసి అతన్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ వ్యవస్థలోని లోపాలు, వారి కార్యదక్షత, కింది స్థాయి సిబ్బందిని ఎంత ఇబ్బంది పెడతారు.. వారిపట్ల ఎంత నిర్దయగా ఉంటారు అనే అంశాలను నిక్కచ్చిగా చూపించాడు వెట్రిమారన్. అదే టైమ్ లో ఇప్పటి వరకూ కమెడియన్ గానే ఉన్న సూరిని హీరోగా మార్చాడు. ఓ చిన్న కానిస్టేబుల్ గా ఎంతో పెద్ద పోలీస్ బలగం చేయలేని పనిని తను ఒక్కడుగా చేయడాన్ని హీరోయిక్ గా కాకుండా నేచురల్ గా కన్విన్సింగ్ గా చెప్పాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో విజయ్ సేతుపతికి పెద్దగా స్కోప్ లేదు. మరి అతను మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు మారాడు అనే కోణంలో ఈ రెండో భాగం కనిపించబోతోంది. మామూలుగా అయితే ముందు ఈ పార్ట్ రావాలి. కానీ వెట్రిమారన్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. అదే చూపించాడు. కాస్త స్లో నెరేషన్ అన్న కంప్లైంట్ వచ్చినా.. ఫస్ట్ పార్ట్ లో ఒక ఇంటెన్సిటీతో ఆకట్టుకున్నాడు వెట్రి. ఈ పార్ట్ తో ఒక విప్లవకారుడుని పరిచయం చేయబోతున్నాడు. అతనే విజయ్ సేతుపతి. తిరుగుబాటు దారుడుగా అతన్ని మొదటి భాగంలో పరిచయం చేశాడు. అతని తిరుగుబాటు ఎవరిపై ఎందుకు అనేది ఈ పార్ట్ లో ఉంటుంది. ఇందులోనూ సూరి పాత్ర ఉంటుంది. చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న విడుదల 2 మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.విడుదల 2 ను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ లో ఓ ఖుష్ వచ్చింది. అనుకన్ను దానికంటే కాస్త ఎక్కువ ఆలస్యంగానే విడుదలవుతోంది. అయినా కొన్ని మంచి సినిమాల కోసం ఆ మాత్రం ఆగినా తప్పు లేదు అని సర్ది చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. విజయ్, సూరిలతో పాటు మంజు వారియర్, భవానీ శ్రీ, అనురాగ్ కశ్యప్, కిశోర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి వారు మరోసారి కీలకంగా ఉండబోతున్నారు. అలాగే ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

Aug 29, 2024 - 22:00
Aug 29, 2024 - 22:11
 0  0
Vetrimaaran  : ఆ విప్లవకారుడు వచ్చేది అప్పుడే

కోలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లో విడుదలై 2 ఒకటి. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ పార్ట్ లో మోస్ట్ వాంటెడ్ రెబల్ అయిన విజయ్ ని పట్టుకోవడానికి ఒక పోలీస్ బెటాలియనే క్యాంప్ వేసి అతన్ని పట్టుకునే ప్రయత్నంలో పోలీస్ వ్యవస్థలోని లోపాలు, వారి కార్యదక్షత, కింది స్థాయి సిబ్బందిని ఎంత ఇబ్బంది పెడతారు.. వారిపట్ల ఎంత నిర్దయగా ఉంటారు అనే అంశాలను నిక్కచ్చిగా చూపించాడు వెట్రిమారన్. అదే టైమ్ లో ఇప్పటి వరకూ కమెడియన్ గానే ఉన్న సూరిని హీరోగా మార్చాడు. ఓ చిన్న కానిస్టేబుల్ గా ఎంతో పెద్ద పోలీస్ బలగం చేయలేని పనిని తను ఒక్కడుగా చేయడాన్ని హీరోయిక్ గా కాకుండా నేచురల్ గా కన్విన్సింగ్ గా చెప్పాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో విజయ్ సేతుపతికి పెద్దగా స్కోప్ లేదు. మరి అతను మోస్ట్ వాంటెడ్ గా ఎందుకు మారాడు అనే కోణంలో ఈ రెండో భాగం కనిపించబోతోంది. మామూలుగా అయితే ముందు ఈ పార్ట్ రావాలి. కానీ వెట్రిమారన్ సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. అదే చూపించాడు. కాస్త స్లో నెరేషన్ అన్న కంప్లైంట్ వచ్చినా.. ఫస్ట్ పార్ట్ లో ఒక ఇంటెన్సిటీతో ఆకట్టుకున్నాడు వెట్రి. ఈ పార్ట్ తో ఒక విప్లవకారుడుని పరిచయం చేయబోతున్నాడు. అతనే విజయ్ సేతుపతి. తిరుగుబాటు దారుడుగా అతన్ని మొదటి భాగంలో పరిచయం చేశాడు. అతని తిరుగుబాటు ఎవరిపై ఎందుకు అనేది ఈ పార్ట్ లో ఉంటుంది. ఇందులోనూ సూరి పాత్ర ఉంటుంది. చాలామంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న విడుదల 2 మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

విడుదల 2 ను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ లో ఓ ఖుష్ వచ్చింది. అనుకన్ను దానికంటే కాస్త ఎక్కువ ఆలస్యంగానే విడుదలవుతోంది. అయినా కొన్ని మంచి సినిమాల కోసం ఆ మాత్రం ఆగినా తప్పు లేదు అని సర్ది చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. విజయ్, సూరిలతో పాటు మంజు వారియర్, భవానీ శ్రీ, అనురాగ్ కశ్యప్, కిశోర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి వారు మరోసారి కీలకంగా ఉండబోతున్నారు. అలాగే ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News