Vijay New party : పార్టీ జెండా ఆవిష్కరించిన విజయ్

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. తమిళ నాట ఇది ఇంకాస్త ఎక్కువ. అయితే తమిళనాడులో ఒక తరం తర్వాత రాజకీయాల్లో సినిమావాళ్లు ఎక్కువగా సక్సెస్ కాలేదు. రీసెంట్ గా కూడా కమల్ హాసన్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. అంతకు ముందు విజయ్ కాంత్ కావొచ్చు, తర్వాతి కాలంలో శరత్ కుమార్ అయినా.. ఏదో పార్టీ పెట్టేముందు హడావిడీ చేయడం.. ఎన్నికల్లో తేలిపోవడం చస్తున్నాం. అయితే వీళ్లంతా కేవలం అభిమానులను మాత్రమే నమ్ముకున్నారు. పార్టీలకు సిద్ధాంతాలు, నిర్మాణాత్మక కార్యచరణ, గ్రౌండ్ లెవల్ లో సత్తా చాటే నాయకత్వాన్ని బలపరచుకోవడం వంటివేం వీళ్లు చేయలేదు. ఇక ఇప్పుడు కోలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడైన విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సొంతంగా పార్టీ పెట్టాడు. ‘ తమిళగ వెట్రి కళగం’ అనే పేరుతో తాజాగా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించాడు. ఈ పార్టీ పేరుకు తెలుగులో అర్థం తమిళ విజయ సమాఖ్య అనుకోవచ్చు. ఇక ఈ జెండా చూస్తే పార్టీ సింబల్ కు రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. బహుజన వాదానికి, అంబేద్కరిజానికి ఏనుగును సింబాలిక్ గా చెప్పుకుంటారు. అదే దీనికి ఆదర్శం కావొచ్చు. ఇక పార్టీ జెండాలో ఎవరి ఫోటోస్ లేవు. కాకపోతే కర్ణాటక రాష్ట్ర జెండాను పోలి ఉందన్న కమెంట్స్ వచ్చాయి.ఇక ఈ ఆగస్ట్ 22 తనకు గొప్ప రోజుగా చెప్పాడు విజయ్. తమిళ ప్రజల ఆత్మగౌరవం కాపాడ్డం, రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందని చెప్పాడు. ఈ మధ్య కాలంలో పార్టీలు పెట్టిన వారికి భిన్నంగా.. విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల్లోకి పూర్తిగా యాక్టివ్ అవుతూ సినిమా రంగం నుంచి తప్పుకుంటా అని ప్రకటించాడు. అతను నటించిన గోట్ మూవీ సెప్టెంబర్ 5న విడుదలవుతుంది. ఆ తర్వాత హెచ్ వినోద్ డైరెక్షన్ లో చివరి సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ నుంచి వినిపిస్తోన్న దాన్ని బట్టి సెప్టెంబర్ చివరి వారంలో తమిళనాడులో ఓ భారీ ర్యాలీ స్వయంగా నిర్వహించబోతున్నాడు విజయ్. ఆ ర్యాలీతో తన బలాన్ని కూడా ప్రజలకు చూపించాలనుకుంటున్నాడు. తమ పార్టీ తరఫున 2026 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాడు విజయ్. మరి సినిమాల పరంగా అతనికి తిరుగులేని స్టార్డమ్ ఉంది. ఆ స్టార్డమ్ రాజకీయాల్లోనూ పనిచేస్తుందా.. అతను తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పగలడా అనేది చూడాలి. 

Aug 23, 2024 - 11:15
 0  1
Vijay New party : 
పార్టీ జెండా ఆవిష్కరించిన విజయ్

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. తమిళ నాట ఇది ఇంకాస్త ఎక్కువ. అయితే తమిళనాడులో ఒక తరం తర్వాత రాజకీయాల్లో సినిమావాళ్లు ఎక్కువగా సక్సెస్ కాలేదు. రీసెంట్ గా కూడా కమల్ హాసన్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది. అంతకు ముందు విజయ్ కాంత్ కావొచ్చు, తర్వాతి కాలంలో శరత్ కుమార్ అయినా.. ఏదో పార్టీ పెట్టేముందు హడావిడీ చేయడం.. ఎన్నికల్లో తేలిపోవడం చస్తున్నాం. అయితే వీళ్లంతా కేవలం అభిమానులను మాత్రమే నమ్ముకున్నారు. పార్టీలకు సిద్ధాంతాలు, నిర్మాణాత్మక కార్యచరణ, గ్రౌండ్ లెవల్ లో సత్తా చాటే నాయకత్వాన్ని బలపరచుకోవడం వంటివేం వీళ్లు చేయలేదు. ఇక ఇప్పుడు కోలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడైన విజయ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సొంతంగా పార్టీ పెట్టాడు. ‘ తమిళగ వెట్రి కళగం’ అనే పేరుతో తాజాగా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించాడు. ఈ పార్టీ పేరుకు తెలుగులో అర్థం తమిళ విజయ సమాఖ్య అనుకోవచ్చు. ఇక ఈ జెండా చూస్తే పార్టీ సింబల్ కు రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. బహుజన వాదానికి, అంబేద్కరిజానికి ఏనుగును సింబాలిక్ గా చెప్పుకుంటారు. అదే దీనికి ఆదర్శం కావొచ్చు. ఇక పార్టీ జెండాలో ఎవరి ఫోటోస్ లేవు. కాకపోతే కర్ణాటక రాష్ట్ర జెండాను పోలి ఉందన్న కమెంట్స్ వచ్చాయి.

ఇక ఈ ఆగస్ట్ 22 తనకు గొప్ప రోజుగా చెప్పాడు విజయ్. తమిళ ప్రజల ఆత్మగౌరవం కాపాడ్డం, రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందని చెప్పాడు.

ఈ మధ్య కాలంలో పార్టీలు పెట్టిన వారికి భిన్నంగా.. విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల్లోకి పూర్తిగా యాక్టివ్ అవుతూ సినిమా రంగం నుంచి తప్పుకుంటా అని ప్రకటించాడు. అతను నటించిన గోట్ మూవీ సెప్టెంబర్ 5న విడుదలవుతుంది. ఆ తర్వాత హెచ్ వినోద్ డైరెక్షన్ లో చివరి సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ నుంచి వినిపిస్తోన్న దాన్ని బట్టి సెప్టెంబర్ చివరి వారంలో తమిళనాడులో ఓ భారీ ర్యాలీ స్వయంగా నిర్వహించబోతున్నాడు విజయ్. ఆ ర్యాలీతో తన బలాన్ని కూడా ప్రజలకు చూపించాలనుకుంటున్నాడు. తమ పార్టీ తరఫున 2026 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాడు విజయ్. మరి సినిమాల పరంగా అతనికి తిరుగులేని స్టార్డమ్ ఉంది. ఆ స్టార్డమ్ రాజకీయాల్లోనూ పనిచేస్తుందా.. అతను తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పగలడా అనేది చూడాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News