Vijay Sethupathi : విజయ్ సేతుపతితో నిత్య మీనన్

మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న బ్యూటీ నిత్య మీనన్. రీసెంట్ గా బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న ఈ బబ్లీ బ్యూటీ కథ నచ్చితేనే కమిట్ అవుతుంది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఏనాడూ గ్లామర్ రోల్స్ చేయలేదు. ఆ పాత్రలకు దూరంగానే ఉంటుంది. అలాంటి భామ విజయ్ సేతుపతి లాంటి నటుడితో జోడీ కడుతోందంటే ఖచ్చితంగా టాక్ ఆఫ్ టౌన్ అవుతుంది. యస్.. ప్రస్తుతం విజయ్ సేతుపతి మిస్కిన్ డైరెక్షన్ లో ట్రైన్ అనే విలక్షణమైన సినిమా చేస్తున్నాడు. కెరీర్ లో మాగ్జిమం థ్రిల్లర్ మూవీస్ నే తీసిన మిస్కిన్ తో మూవీ అంటే విజయ్ నుంచి మరో బెస్ట్ ఎంటర్టైనర్ వస్తుందుకుంటున్నారు ఫ్యాన్స్. విజయ్ కూడా కేవలం కథకే మొదటి ప్రాధాన్యం ఇస్తాడు.విజయ్, నిత్య మీనన్ నటించే సినిమాకు అత్యంత ప్రతిభావంతుడు అన్న పేరు తెచ్చుకున్నా పాండిరాజ్ దర్శకుడు. ఇతని ఫస్ట్ మూవీ ‘పసంగ’కు ఏకంగా రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అవార్డులతో పాటు కమర్షియల్ హిట్స్ కొట్టడంలోనూ ఎక్స్ పర్ట్ అయిన పాండిరాజ్ తో ఈ ఇద్దరి మూవీ అంటే మరో బలమైన కథాంశంతో వస్తున్నట్టుగానే భావించాలి. ఇక ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందట. పాండిరాజ్ లాస్ట్ మూవీ సూర్యతో చేసిన ‘ఈ.టి’. ఇది కూడా ఫ్యామిలీ కథాంశమే. కానీ ఓ బలమైన ఇష్యూ గురించి ఈ మూవీలో చూపించాడు. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ తో చేసే సినిమాలో కూడా కొన్ని కరెంట్ ఇష్యూస్ ను టచ్ చేస్తారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ న్యూస్ రాబోతోంది. 

Aug 24, 2024 - 18:22
 0  2
Vijay Sethupathi : 
విజయ్ సేతుపతితో నిత్య మీనన్

మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న బ్యూటీ నిత్య మీనన్. రీసెంట్ గా బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న ఈ బబ్లీ బ్యూటీ కథ నచ్చితేనే కమిట్ అవుతుంది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఏనాడూ గ్లామర్ రోల్స్ చేయలేదు. ఆ పాత్రలకు దూరంగానే ఉంటుంది. అలాంటి భామ విజయ్ సేతుపతి లాంటి నటుడితో జోడీ కడుతోందంటే ఖచ్చితంగా టాక్ ఆఫ్ టౌన్ అవుతుంది. యస్.. ప్రస్తుతం విజయ్ సేతుపతి మిస్కిన్ డైరెక్షన్ లో ట్రైన్ అనే విలక్షణమైన సినిమా చేస్తున్నాడు. కెరీర్ లో మాగ్జిమం థ్రిల్లర్ మూవీస్ నే తీసిన మిస్కిన్ తో మూవీ అంటే విజయ్ నుంచి మరో బెస్ట్ ఎంటర్టైనర్ వస్తుందుకుంటున్నారు ఫ్యాన్స్. విజయ్ కూడా కేవలం కథకే మొదటి ప్రాధాన్యం ఇస్తాడు.

విజయ్, నిత్య మీనన్ నటించే సినిమాకు అత్యంత ప్రతిభావంతుడు అన్న పేరు తెచ్చుకున్నా పాండిరాజ్ దర్శకుడు. ఇతని ఫస్ట్ మూవీ ‘పసంగ’కు ఏకంగా రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అవార్డులతో పాటు కమర్షియల్ హిట్స్ కొట్టడంలోనూ ఎక్స్ పర్ట్ అయిన పాండిరాజ్ తో ఈ ఇద్దరి మూవీ అంటే మరో బలమైన కథాంశంతో వస్తున్నట్టుగానే భావించాలి. ఇక ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుందట. పాండిరాజ్ లాస్ట్ మూవీ సూర్యతో చేసిన ‘ఈ.టి’. ఇది కూడా ఫ్యామిలీ కథాంశమే. కానీ ఓ బలమైన ఇష్యూ గురించి ఈ మూవీలో చూపించాడు. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ తో చేసే సినిమాలో కూడా కొన్ని కరెంట్ ఇష్యూస్ ను టచ్ చేస్తారని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ న్యూస్ రాబోతోంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News