Vijay Thalapathy : విజయ్, త్రిష మధ్య ఏం జరుగుతోంది..?

తమిళ్ స్టార్ దళపతి విజయ్ కి అక్కడ ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. కొన్నాళ్లుగా తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఇన్నాళ్ల కెరీర్ లో విజయ్ కి సంబంధించి పెద్దగా ఎఫైర్స్ అనే మాట వినిపించలేదు. తన పనేదో తను చేసుకుంటూ వెళతాడు అంతే. ఇద్దరు పిల్లలతో కూడిన హ్యాపీ లైఫ్. త్వరలోనే అతని కొడుకు దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. విజయ్ నటించిన గోట్ మూవీ సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ కోలీవుడ్ తో పాటు ఎంటైర్ సౌత్ ను సర్ ప్రైజ్ చేసింది.గోట్ సినిమాలో త్రిష ఒక ‘ఐటమ్ సాంగ్’ చేసిందట. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు స్వయంగా వెల్లడించాడు. అయితే వీళ్లు దాన్ని స్పెషల్ అప్పీరియన్స్ గా చెబుతున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముందీ అనుకుంటున్నారా.. ఉంది. త్రిష కెరీర్ మొదలుపెట్టి 25 యేళ్లవుతోంది. చాలా వేగంగానే తను స్టార్ హీరోయిన్ గా మారింది. నెంబర్ వన్ ప్లేస్ నూ ఎంజాయ్ చేసింది. కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడు, కాస్త డౌన్ అయినప్పుడూ చాలామంది తనను స్పెషల్ సాంగ్స్ కోసం అప్రోచ్ అయ్యారు. తన తర్వాత వచ్చిన తమన్నా, కాజల్ వంటి వాళ్లు కూడా ఐటమ్ సాంగ్స్ చేశారు. బట్ త్రిష ఇటు తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఎప్పుడూ ఈ తరహా సాంగ్స్ కు ఓకే చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం విజయ్ కోసం మాత్రమే ఈ పాట చేయడానికి ఒప్పుకుందనే మాట సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. అఫ్ కోర్స్ అందుకు కారణాలూ లేకపోలేదు. కొన్నాళ్లుగా విజయ్, త్రిష మధ్య ఏదో జరుగుతోందనే గాసిప్స్ బాగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి ఫస్ట్ టైమ్ గిల్లి మూవీలో నటించారు. ఇది బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం ఉంది. తర్వాత కూడా కొన్ని బ్లాక్ బస్టర్స్ లో నటించారు. అయితే విజయ్ లాస్ట్ మూవీ లియో కు ముందు నుంచీ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. పైగా తనకు షూటింగ్ లేకపోతే త్రిష.. విజయ్ మూవీ సెట్స్ లో ఎక్కువగా కనిపించిందని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా అతని కోసమే ఈ స్పెషల్ సాంగ్ చేసింది.. అంటే ఇద్దరి మధ్యా ఏదో ఉందనేది నిజమే అంటోంది కోలీవుడ్. కానీ అతి కొద్ది రోజుల్లోనే విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఈ తరుణంలో ఇలాంటి వ్వవహారాలు పెట్టుకుంటే అతని పార్టీ ఎస్టాబ్లిష్ కావడానికి ముందే పరువు బ్లాస్ట్ అవుతుంది. అందుకే విజయ్, త్రిష మధ్య అంతా అనుకుంటోన్న ‘బంధం’ ఉండి ఉండకపోవచ్చు అంటున్నారు. ఏమో.. నిప్పు లేకుండా పొగరాదంటారు కదా. మరి ఇక్కడ నిప్పు ఉందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. 

Aug 26, 2024 - 20:05
 0  4
Vijay Thalapathy : విజయ్, త్రిష మధ్య ఏం జరుగుతోంది..?

తమిళ్ స్టార్ దళపతి విజయ్ కి అక్కడ ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. కొన్నాళ్లుగా తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఇన్నాళ్ల కెరీర్ లో విజయ్ కి సంబంధించి పెద్దగా ఎఫైర్స్ అనే మాట వినిపించలేదు. తన పనేదో తను చేసుకుంటూ వెళతాడు అంతే. ఇద్దరు పిల్లలతో కూడిన హ్యాపీ లైఫ్. త్వరలోనే అతని కొడుకు దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. విజయ్ నటించిన గోట్ మూవీ సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ కోలీవుడ్ తో పాటు ఎంటైర్ సౌత్ ను సర్ ప్రైజ్ చేసింది.

గోట్ సినిమాలో త్రిష ఒక ‘ఐటమ్ సాంగ్’ చేసిందట. ఈ విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు స్వయంగా వెల్లడించాడు. అయితే వీళ్లు దాన్ని స్పెషల్ అప్పీరియన్స్ గా చెబుతున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముందీ అనుకుంటున్నారా.. ఉంది. త్రిష కెరీర్ మొదలుపెట్టి 25 యేళ్లవుతోంది. చాలా వేగంగానే తను స్టార్ హీరోయిన్ గా మారింది. నెంబర్ వన్ ప్లేస్ నూ ఎంజాయ్ చేసింది. కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడు, కాస్త డౌన్ అయినప్పుడూ చాలామంది తనను స్పెషల్ సాంగ్స్ కోసం అప్రోచ్ అయ్యారు. తన తర్వాత వచ్చిన తమన్నా, కాజల్ వంటి వాళ్లు కూడా ఐటమ్ సాంగ్స్ చేశారు. బట్ త్రిష ఇటు తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఎప్పుడూ ఈ తరహా సాంగ్స్ కు ఓకే చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు కేవలం విజయ్ కోసం మాత్రమే ఈ పాట చేయడానికి ఒప్పుకుందనే మాట సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. అఫ్ కోర్స్ అందుకు కారణాలూ లేకపోలేదు.

కొన్నాళ్లుగా విజయ్, త్రిష మధ్య ఏదో జరుగుతోందనే గాసిప్స్ బాగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి ఫస్ట్ టైమ్ గిల్లి మూవీలో నటించారు. ఇది బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి నుంచి వీరి మధ్య మంచి స్నేహం ఉంది. తర్వాత కూడా కొన్ని బ్లాక్ బస్టర్స్ లో నటించారు. అయితే విజయ్ లాస్ట్ మూవీ లియో కు ముందు నుంచీ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. పైగా తనకు షూటింగ్ లేకపోతే త్రిష.. విజయ్ మూవీ సెట్స్ లో ఎక్కువగా కనిపించిందని కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా అతని కోసమే ఈ స్పెషల్ సాంగ్ చేసింది.. అంటే ఇద్దరి మధ్యా ఏదో ఉందనేది నిజమే అంటోంది కోలీవుడ్.

కానీ అతి కొద్ది రోజుల్లోనే విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఈ తరుణంలో ఇలాంటి వ్వవహారాలు పెట్టుకుంటే అతని పార్టీ ఎస్టాబ్లిష్ కావడానికి ముందే పరువు బ్లాస్ట్ అవుతుంది. అందుకే విజయ్, త్రిష మధ్య అంతా అనుకుంటోన్న ‘బంధం’ ఉండి ఉండకపోవచ్చు అంటున్నారు. ఏమో.. నిప్పు లేకుండా పొగరాదంటారు కదా. మరి ఇక్కడ నిప్పు ఉందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News