Vijayawada floods: విజయవాడ భారీ వర్షానికి గజ గజ
Vijayawada floods: విజయవాడ భారీ వర్షానికి గజ గజ
ఎడతెరపిలేని కుండపోత వర్షానికి విజయవాత అతలాకులతమైంది. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ చిగురుటాకులా వణికిపోయింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద ప్రవాహానికి కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయి వర్షం పడలేదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పాతబస్తీ, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి, ఆటోనగర్, పలు కాలనీలు, శివారు ప్రాంతాలు ఒకటేంటి.. అన్ని ప్రాంతాల్లోనూ భారీ వరద పోటెత్తింది. నగరంలోని దారులే కాదు.. జాతీయ రహదారులూ నీటిలో చిక్కుకుపోయాయి.
శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షం ఇంకా కొనసాగుతోంది. కుండపోతగా వర్షం కురవడంతో రహదారులన్నీ చెరువుల్లా మారిపోయాయి. అన్ని చోట్ల దాదాపు మూడు నాలుగడుగుల మేర నీరు నిలిచింది. మధురానగర్ వంతెన, కృష్ణలంక అండర్‌గ్రౌండ్ వంతెనల వద్ద అయిదడుగుల వరకు నీరు నిలిచింది. సాధారణంగా ఇక్కడ వీఎంసీ మోటార్లు ఏర్పాటుచేసి వరద ఎత్తిపోస్తారు. ఇంజిన్లు పాడయ్యాయని వదిలేశారు. పీఎన్‌బీఎస్‌లోకి బస్సులు రాలేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏలూరు మార్గంలో రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపై వరద ముంచెత్తడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆటోనగర్ నుంచి బెంజిసర్కిల్ వరకు నీరు నిలిచింది. నిర్మల కాన్వెంట్, పాలీక్లినిక్ రహదారి, అయిదో నంబరు మార్గం, ఏలూరు రోడ్డు, భవానీపురం, విద్యాధరపురం, సత్యనారాయణపురం ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 29 సెం.మీ.వర్షపాతం నమోదైందని, అందుకే నగరం జలదిగ్బంధమైందని కలెక్టర్ జి.సృజన అభిప్రాయపడ్డారు.
రాయపాటి బ్రిడ్జిపై వరద
బనగానపల్లె నుంచి టంగుటూరు మీదుగా నంద్యాలకు వెళ్లే రహదారిలో రాయపాటి బ్రిడ్జి పైన వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి ఎక్కువ కావడంతో పోలీసులు రాకపోగలను నిషేధించారు. దీంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నంద్యాల జిల్లాలో జనజీవనం స్థంబించి అస్తవ్యస్తంగా తయారైంది.
What's Your Reaction?