Vijayawada: భారీ వర్షానికి విజయవాడ అతలాకుతలం
Vijayawada: భారీ వర్షానికి విజయవాడ అతలాకుతలం
విజయవాడలో భారీ వర్షం, ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయం. ద్విచక్ర వాహనాలు మరి కొన్ని గంటల పాటు రోడ్ల పైకి రావొద్దని పోలీసుల హెచ్చరికలు. VVIP లను బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరికలు, నగరంలో ప్రధాన రోడ్లన్నీ జలమయం. జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రొడ్లలోకి వాహనాల మళ్లింపు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించ వద్దని పోలీసుల ఆదేశాలు. వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేయాలని అధికారుల ఆదేశాలు. విజయవాడలోకి వచ్చే వాహనాలు దారి మల్లించాలని సూచన. పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై నిలిచిన భారీ వాహనాలు బెంజ్ సర్కిల్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు. నగరంలోని ప్రధాన రోడ్లపై మోకాలి లోతు నీళ్ళు నగరంలోకి వచ్చే వాహనాలు మొత్తం మళ్లింపు. ఎస్కార్ట్ వాహనాలను ముందస్తు అనుమతి లేకుండా నగరంలోకి అనుమతించకూడదని సూచనలు..* బెంజ్ సర్కిల్ నుంచి ఆటో నగర్ వరకు ఎంజీ రోడ్డుపై నిలిచిన వాహనాలు. మొఘల్ రాజ్ పురంలో విరిగిన కొండ చరియలు. ప్రధాన కూడళ్లలో ఫైర్ ఇంజన్ లతో నీళ్ళు తొలగించే ప్రయత్నాలు. పాతబస్తీలో ఔట్ ఫాల్ డ్రెయిన్ పొంగడంతో ఇళ్లలోకి చేరిన నీరు. నిడమానూరు నుంచి టంకసాల వరకు పూర్తిగా నీట మునిగిన జాతీయ రహదారి.
What's Your Reaction?