Viral Fevers : ఏపీలో విష జ్వరాల విజృంభణ.. జ్వరం వస్తే హైఅలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విష జ్వరాలతో మంచం పట్టింది. రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వరం బాధితులతో ఫుల్ అవుతున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్ల నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి ఈ నెల 20 నుంచి 26వ తేదీ మధ్య 70వేల 812 మంది జ్వర లక్షణాలతో వచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య ఇంతకు రెండింతలు ఎక్కువ ఉంటుంది. రోజురోజుకూ రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసిన వారిలో జ్వరం బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మలేరియా, డెంగీ కేసులు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గతేడాది కనిపించారు. ఈసారి ఆ తరహా బాడీ టెంప్రేచర్ కనిపించనప్పటికీ బాధితుల్లో నీరసం ఎక్కువగా వుంటోంది. పిల్లల్లో ఎడినో, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జ్వరాలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలూ కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి తోడు పారిశుద్ధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. నీరు, గాలి కాలుష్యం తోడై జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కుక్కునూరు మండలాల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గాల పరిధిలోనూ విషజ్వరాల బెడద ఎక్కువగా ఉంది. నవంబర్ లో వైరల్ జ్వరాల సీజన్ తగ్గేవరకు.. జ్వర లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విష జ్వరాలతో మంచం పట్టింది. రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వరం బాధితులతో ఫుల్ అవుతున్నాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్ల నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి ఈ నెల 20 నుంచి 26వ తేదీ మధ్య 70వేల 812 మంది జ్వర లక్షణాలతో వచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య ఇంతకు రెండింతలు ఎక్కువ ఉంటుంది. రోజురోజుకూ రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసిన వారిలో జ్వరం బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. మలేరియా, డెంగీ కేసులు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గతేడాది కనిపించారు. ఈసారి ఆ తరహా బాడీ టెంప్రేచర్ కనిపించనప్పటికీ బాధితుల్లో నీరసం ఎక్కువగా వుంటోంది.
పిల్లల్లో ఎడినో, ఇన్‌ఫ్లూయెంజా వైరస్ జ్వరాలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలూ కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి తోడు పారిశుద్ధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. నీరు, గాలి కాలుష్యం తోడై జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, కుక్కునూరు మండలాల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గాల పరిధిలోనూ విషజ్వరాల బెడద ఎక్కువగా ఉంది. నవంబర్ లో వైరల్ జ్వరాల సీజన్ తగ్గేవరకు.. జ్వర లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
What's Your Reaction?