Vivo T3 Pro 5G | వివో నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ వివో టీ3 ప్రో 5జీ.. ఇవీ డిటెయిల్స్..!

Vivo T3 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 ప్రో 5జీ (Vivo T3 Pro 5G) ఫోన్ ను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది.

Aug 27, 2024 - 20:58
 0  6
Vivo T3 Pro 5G | వివో నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ వివో టీ3 ప్రో 5జీ.. ఇవీ డిటెయిల్స్..!
Vivo

Vivo T3 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 ప్రో 5జీ (Vivo T3 Pro 5G) ఫోన్ ను భారత్ మార్కెట్లో మంగళవారం ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో వస్తోందీ ఫోన్. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.77 అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తోంది. ఇంతకు ముందే భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన వివో టీ3 5జీ, వివో టీ3 లైట్, వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్లతో వివో టీ3 ప్రో 5జీ ఫోన్ జత కలిసింది.

వివో టీ3 ప్రో 5జీ (Vivo T3 Pro 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999 పలుకుతుంది. సెప్టెంబర్ మూడో తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటుంది. ఎమరాల్డ్ గ్రీన్, శాండ్ స్టోన్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

వివో టీ3 ప్రో 5జీ (Vivo T3 Pro 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.77 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2392 పిక్సెల్స్0 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది.

వివో టీ3 ప్రో 5జీ (Vivo T3 Pro 5G) ఫోన్ 80 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News