Women’s T20 WC | వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ని ప్రకటించిన ఐసీసీ.. అక్టోబర్ 6 దాయాదుల పోరు..!
Women's T20 WC | ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2024కి కౌంట్‌డౌన్ మొదలైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా అక్టోబర్ 3న మెగా టోర్నీ ప్రారంభం కానున్నది. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యూఏఈకి తరలిస్తూ నిర్ణయం తీసుకున్నది.
Women’s T20 WC | ఐసీసీ వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2024కి కౌంట్‌డౌన్ మొదలైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా అక్టోబర్ 3న మెగా టోర్నీ ప్రారంభం కానున్నది. వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యూఏఈకి తరలిస్తూ నిర్ణయం తీసుకున్నది. మ్యాచులన్నీ దుబాయి, షార్జాలో జరుగనున్నాయి. వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఐదేసి జట్ల చెప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండిస్, బంగ్లాదేశ్ స్కాట్‌లాండ్ ఉన్నాయి.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ ఒకటి వరకు పది ప్రాక్టీస్ మ్యాచులు జరుగనున్నాయి. టోర్నమెంట్‌లో ప్రతి జట్టు నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. సెమీస్ మ్యాచులు 17, 18 తేదీల్లో జరుగుతున్నాయి. అదే నెల 20న దుబాయి వేదికగా ఫైనల్ జరుగనున్నది. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులకు రిజర్వ్ డే ఉంటుంది. దుబాయి, షార్జాల్లో మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉండగా.. అక్టోబర్ 6న దుబాయిలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవనున్నది. బీసీసీఐ ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించాల్సి ఉంది.
What's Your Reaction?