YCP: ఓడినా... మారని వైసీపీ
ఘోర ఓటమిని విశ్లేషించుకోని వైసీపీ... ఒక్కొక్కరుగా దూరమవుతున్న నేతలు
ఏపీలో వై నాట్ 175 పేరుతో ప్రారంభించి చివరికి 11 స్థానాలకు పడిపోయిన వైసీపీ.. తాము ఎందుకంత ఘోరంగా ఓడిపోయాం. ఎంత పాతాళానికి దిగిపోయామో.. ప్రజలు ఎందుకు చీదరించుకున్నారో ఇంకా విశ్లేషించుకునే పరిస్థితుల్లో వైసీపీ ఉన్నట్టు కనబడటం లేదు. కనీసం బయటకు తెలియకుండా అయినా.. వాస్తవాలు తెలుసుకుని.. పార్టీకి పూర్వ వైభవం తీసుకోచ్చేలా చేసి ముందుకు సాగుదామని అనుకోవడం లేదు.
ఓటమిలో సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర..
2019 ఎన్నికలకు ముందు వైసీపీకి సోషల్ మీడియా బ్యాక్బోన్ లాంటిది. వైసీపీ విపరీతమైన క్రేజ్ను తీసుకొచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించింది. పార్టీపై యువతలో బలమైన వ్యతిరేక ముద్ర పడేలా చేసింది. వైసీపీని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిపై బూతులతో దాడి చేయడం దగ్గర్నుంచి వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా వదిలి పెట్టలేదు. ప్రభుత్వం పై ఎవరూ ఆందోళన చేసినా వేధింపులకు గురి చేయడంతో ఈ సైకోల బారిన మళ్లీ పడాలా అన్న ఆలోచనకు ప్రజలు వచ్చారు. ఓడిపోయిన తర్వాత కనీసం మనం ఎందుకు ఓడిపోయాం, పార్టీని ఏవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విశ్లేషణ కూడా చేసుకునే ప్రయత్నం చేయలేదు. అంత కంటే నీచంగా పార్టీ నాయకులు ప్రవర్తించడం ప్రారంభించారు. ఇసుక విధానాలపై, ఉద్యోగులపై, అన్న క్యాంటీన్ల మీద చేసే విష ప్రచారంతో పార్టీపై ఎంత రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవడం లేదు.
బయటపడుతున్న నేతల వెకిలి చేష్టలు
అధికారం ఉన్నప్పుడే చెలరేగిపోయారు. అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంకా ఎన్ని బయటకు వస్తాయో చెప్పలేం. గోరంట్ల మాధవ్, అనంత్బాబు,అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో అందరూ పెద్ద కళాకారులే.. ప్రతి ఒక్కరి గుట్టు ఎవరో ఒకరి దగ్గర ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చివరికి సలహాదారుడు కూడా ఉన్నాడని చెబుతున్నారు. ఎప్పుడు ఏ వీడియో బయటకు వస్తుందోనన వైసీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. అయితే ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని ప్రజల్లో ఇమేజ్ అయినా కాస్త పెంచుకుందామన్న ప్రయత్నాలు అసలు వైసీపీ హైకమాండ్ చేయడం లేదు. అలాంటి వారే తమ స్టార్ ప్లేయర్లన్నట్లుగా వ్యవహరిస్తోంది.
పార్టీ తరపున మాట్లాడేది.. వారేనా
పార్టీ వాదన ప్రజల్లోకి వెళ్లాలంటే.. వాటి గురించి చెప్పే నేతలకు ఓ మాదిరి ఇమేజ్ అయినా ఉండాలి. కానీ ప్రజల్లో దారుణమైన ఇమేజ్ ఉన్న పేర్ని నాని, అంబటి రాంబాబుల్ని తెర మీదకు తెస్తున్నారు. వారు మాట్లాడే మాటలతో అసలు విషయం పక్కకు పోతుంది. ఎలా చూసినా.. వైసీపీ నేల బారు రాజకీయాన్ని దాటి కనీస విలువలున్న రాజకీయాలు చేద్దామన్న ఆలోచన చేయడం లేదు.
What's Your Reaction?