Yemen Shipwreck: యెమెన్ తీరంలో పడవ బోల్తా
13 మంది మృతి,14 మంది గల్లంతు..
యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడంతో 13 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి మైగ్రేషన్ ఏజెన్సీని ఉటంకిస్తూ నివేదిక ప్రకారం.. పడవ ప్రమాదంలో 14 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో మంగళవారం వలస పడవ బోల్తా పడింది. ఈ పడవలో తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన 25 మంది పౌరులు ఉన్నారు. ఇద్దరు యెమెన్‌కు చెందినవారు ఉన్నారు. కాగా.. ఈ పడవ తూర్పు ఆఫ్రికా దేశం జిబౌటి నుండి బయలుదేరింది.
పడవ ప్రమాదానికి సంబంధించి IOM నివేదిక ప్రకారం.. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు అన్వేషణ కొనసాగిస్తోంది. తప్పిపోయిన వారిలో యెమెన్ కెప్టెన్.. అతని సహాయకుడు కూడా ఉన్నారు. ఓడ బోల్తా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. యెమెన్‌లోని IOM మిషన్ యొక్క తాత్కాలిక అధిపతి మాట్లాడుతూ.. ఇది ప్రమాదకరమైనది అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వలసదారులు ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నారని చెప్పారు. జూన్-జూలైలో కూడా పడవ బోల్తా పడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.
2023లో 97,200 మంది వలసదారులు యెమెన్‌కు వచ్చారు. ఈ సంఖ్య 2022 కంటే ఎక్కువ. భద్రతను దృష్టిలో ఉంచుకుని అధిక సంఖ్యలో ప్రజలు సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్నారు. 10 సంవత్సరాలకు పైగా.. ఈ దేశం పేదరికంతో పాటు అంతర్యుద్ధంతో బాధపడుతోంది. సౌదీ అరేబియా.. ఇతర గల్ఫ్ దేశాలకు కార్మికులుగా, గృహ కార్మికులుగా పనిచేయడానికి ప్రజలు వెళ్తున్నారు.
What's Your Reaction?