Zee-Somy : జీ – సోనీ..వివాదం సెటిల్ .. కేసులు విత్ డ్రాకు అంగీకారం
ప్రముఖ మీడియా సంస్థలైన జీ- సోనీ మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. విలీన ఒప్పందం రద్దయిన నేపథ్యంలో నెలకొన్న వివాదాలను ఇరు సంస్థలు పరిష్కరించుకున్నాయి. డీల్ రద్దు అనంతరం పరస్పరం పెట్టుకున్న కేసులను వెనక్కి తీసుకునేందుకు ఓ నిర్ణయానికొచ్చాయి. ఈ మేరకు మంగళవారం రెండు సంస్థలు ప్రకటనను విడుదల చేశాయి.సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌తో పాటు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, ఇతర ఫోరమ్స్‌లో పరస్పరం దాఖలు చేసుకున్న న్యాయ పోరాటాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాయి. ఎవరికి వారు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో సొంతంగా రాణించడంపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చాయి. వివాదం ముగిసిన వేళ జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు ఓ దశలో 14 శాతం మేర రాణించాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (ZEEL)తో కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ -ఎస్‌పీఎన్‌ఐ) 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల) విలీనం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్ల అనంతరం ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు చెందిన సోనీ గ్రూపు కార్పొరేషన్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. దీంతో ఇరు సంస్థల మధ్య వివాదం నెలకొంది. పరస్పరం న్యాయస్థానాలను ఆశ్రయించాయి.

What's Your Reaction?