అక్షయ్ కుమార్ ఆఫర్ చేసిన చిత్రాలను తిరస్కరించాను.. : కంగన
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, కంగనా రనౌత్ మాట్లాడుతూ, అక్షయ్ కుమార్ తనకు చాలా సినిమాలు ఆఫర్ చేసాడు, అయితే ఆ పాత్రలు తనకు సరిపోయేవిగా కనిపించలేదు. అక్షయ్ తనతో సమస్య ఉందా అని కూడా అడిగాడని ఆమె వెల్లడించింది.
తన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ' ప్రచార ఇంటర్వ్యూలో, నటుడు అక్షయ్ కుమార్ తనకు ఆఫర్ చేసిన ప్రధాన చిత్రాలను తిరస్కరించినట్లు గుర్తుచేసుకుంది. నా కారణాలను నేను చెప్పాను.. అదే అక్షయ్‌కి కూడా వివరించాను అని తెలిపింది.
'ఎమర్జెన్సీ'లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించిన కంగనా, 'సింగ్ ఈజ్ బ్లింగ్'లో అక్షయ్ తనకు ఓ పాత్రను ఆఫర్ చేసినట్లు తెలిపింది. దానిని తాను రిజెక్ట్ చేయడంతో అమీ జాక్సన్ ఆ చిత్రంలో కథానాయికగా నటించిందని తెలిపింది. ఆ పాత్ర మహిళల పట్ల గౌరవంగా లేదని అక్షయ్‌తో చెప్పానని కంగనా చెప్పింది.
"అక్షయ్ మళ్లీ నన్ను 'సింగ్ ఈజ్ బ్లింగ్' కోసం పిలిచాడు. తర్వాత అతను మళ్లీ రెండు సినిమాల కోసం నన్ను పిలిచాడు. అప్పుడు అతను 'నాతో మీకు సమస్య ఉందా కంగనా?' అని కూడా అడిగాడు.. ‘అసలు మీతో నాకేం ఇబ్బంది లేదు సార్’ అని చెప్పాను. పాత్రలు నచ్చలేదు అందుకే తిరస్కరించాను అని చెప్పాను.
నటుడు సల్మాన్ ఖాన్‌తో 'బజరంగీ భాయిజాన్' , 'సుల్తాన్'లో పనిచేయడానికి నిరాకరించడం గురించి మాట్లాడింది. కబీర్ ఖాన్-దర్శకత్వంలోని పాత్ర తనకు సరిపోయేంత బలంగా లేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ కానన్‌తో చెప్పింది. తన రెజ్యూమ్‌కు 'సుల్తాన్' సరైనది కాలేదని కంగనా పేర్కొంది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన అనుష్క శర్మ నటించింది.
సల్మాన్ ఇచ్చిన ఆఫర్లను తిరస్కరించినప్పటికీ అతడు ఎప్పుడూ నా పట్ల ఒకే విధంగా ఉండేవాడు. అదే ఇంటర్వ్యూలో ఆమె రణబీర్ కపూర్ 'యానిమల్' అనవసరంగా హింసను ప్రేరేపించారని విమర్శించింది. శవాలను కుప్పగా పోస్తున్నారు.. ఎందుకు? ఇది ప్రజా సంక్షేమం కోసమో, సరిహద్దుల రక్షణ కోసమో కాదు.. కేవలం సరదా కోసమే.. మందు తాగి సరదాగా గడుపుతున్నారు.
ఆమె దర్శకత్వం వహించి, నిర్మించిన కంగనా 'ఎమర్జెన్సీ' సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, దివంగత సతీష్ కౌశిక్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు
What's Your Reaction?