ఆపద్భాందవుడు అన్నయ్య.. చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలి: పవన్ కళ్యాణ్
అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అన్నయ్య పట్ల తనకున్న ఆప్యాయతను, అభిమానాన్ని అక్షరాల ద్వారా చాటుకున్నారు. తన ప్రేమను ప్రస్ఫుటించేందుకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నయ్య చిరంజీవి అంటే ఎనలేని అభిమానం, వదినమ్మ సురేఖను తల్లితో సమానంగా ప్రేమిస్తారు. అన్నయ్య చిరంజీవి విజయానికి ఆయన గుణమే తోడ్పడుతుందని అభివర్ణించారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం అన్నయ్య చిరంజీవి చేసిన సాయం మర్చిపోలినదని గుర్తు చేసుకున్నారు. జనసేన పార్టీకి మద్దతుగా చిరంజీవి అడుగుపెట్టిన కీలక క్షణాన్ని పవన్ పంచుకున్నారు. అన్నయ్య పార్టీకి ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారని, ఆ రోజు ఆయన ఇచ్చిన నైతిక బలం, మద్దతు మా విజయానికి దోహదపడ్డాయని పవన్ కృతజ్ఞతతో పేర్కొన్నారు.
ఆపద్బాంధవుడు అన్నయ్య
నా దృష్టిలో ఆపద్బాంధవుడు అన్నయ్య చిరంజీవి గారు. అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు. అనారోగ్యం బారినపడినవారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం. కొందరికి చేసిన సాయం మీడియా ద్వారా బాహ్య… pic.twitter.com/rNHfPWP03g— JanaSena Party (@JanaSenaParty) August 22, 2024
What's Your Reaction?