కూతురు క్లిన్ కారాతో ఉపాసన జన్మాష్టమి వేడుకలు..
రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కామినేని వారి కుమార్తె క్లిన్ కారతో కలిసి జన్మాష్టమి జరుపుకున్నారు.
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని వారి కుమార్తె క్లిన్ కారాతో కలిసి జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నారు. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పూజా వేడుకలకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. పూజా కార్యక్రమం కోసం, కూతురుతో అడుగులు వేయించారు ఉపాసన. అత్తగారు సురేఖ, భర్త రాంచరణ్ పూజలో పాల్గొన్నారు.
రామ్ చరణ్ వారి పెంపుడు కుక్క రైమ్ తో కలిసి పూజలో కూర్చున్నారు. ఇటీవల, రామ్ చరణ్ కుటుంబం తల్లి తండ్రితో కలిసి ఒలింపిక్స్ 2024 కోసం పారిస్‌కు వెళ్లారు.. 'RRR' నటుడు ఒక ఫోటోను షేర్ చేసి, "క్లిన్ కారా తన తాతయ్యలతో కలిసి చేసిన మొదటి ప్రయాణం!!! గుర్తుండిపోతుంది (sic)" అని రాశారు. రామ్ చరణ్, చిరంజీవి మరియు కుటుంబం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో కలిసి కొంత సమయాన్ని వెచ్చించారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగారు.
వర్క్ ఫ్రంట్‌లో, రామ్ చరణ్ దర్శకుడు శంకర్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్‌ను ముగించాడు. ఈ చిత్రాన్ని 2024 క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. దర్శకుడు బుచ్చి బాబుతో కలిసి రాం చరణ్ ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా త్వరలో ప్రారంభించనున్నారు.
What's Your Reaction?