జస్టిస్ పీసీ ఘోష్ విచారణ.. ఈఎన్సీ మురళీధర్ రావుకు కమిషన్ ప్రశ్నల వర్షం
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ విచారణను వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో బుధవారం కమిషన్ చేపట్టిన బహిరంగ విచారణకు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు హజరయ్యారు. గతంలో మురళీధర్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా విచారణ చేపట్టారు. విచారణలో అన్ని నిజాలే చెబుతానని మురళీధర్‌తో ప్రమాణం చేయించిన అనంతరం పలు కీలక అంశాలపై కమిషన్ చీఫ్ ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టింది. గతంలో 57 మంది కమిషన్ ముందు హాజరై అఫిడవిట్లు దాఖలు చేయగా.. వారిలో ఒక్కొక పిలిచి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే పనిలో కమిషన్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఈఎన్సీగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి? డీపీఆర్‌ను ఎవరు సిద్ధం చేశారు? వంటి పలు ప్రశ్నలను కమిషన్ ఆయనను అడిగినట్లు తెలుస్తోంది.

What's Your Reaction?