నన్ను గుడిలోకి వెళ్లనియ్యలే .. నటి నమిత ఆవేదన
ప్రముఖ నటి నమితకు తమిళనాడులోని మదుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు. 'నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారు. సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. తమి ళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలకు నేను వెళ్లిన. నేను పుట్టుకతో హిందువును. నాపై అగౌరవంగా ప్రవర్తించిన సిబ్బందిని శిక్షించాలి' అని డిమాండ్ చేశారు. నమిత కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో ఈ ఘటనపై ఆలయ పరిపాలన సిబ్బంది స్పందించింది. 'నమితతో ఎవరూ అమర్యాదకరంగా వ్యవహరించలేదు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడాం. పై అధికారులు చెప్పడం తో కొంత సమయం ఆగమని చెప్పాం. తర్వాత ఆమెను దేవాలయంలోకి పంపించాం' అని తెలిపారు.

What's Your Reaction?