ఫాతిమా కాలేజీ కూల్చితే విద్యార్థులే తేల్చుకుంటారు.. అక్బరుద్దీన్ కామెంట్స్ పై కలకలం
హైడ్రాపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఒవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై ఆయన స్పందించారు. చెరువు కబ్జా చేసి ఒవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆక్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించి, కత్తులతో దాడులు చేయండన్నారు. పేదల విద్యాభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిని అడ్డుకోవద్దని అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. ఆ స్కూల్ మాత్రం కూల్చకూడదన్నారు. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించామని, వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారన్నారు.పాతబస్తీలో చెరువులు కబ్జాకు గురయ్యాయని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి గుర్తుచేశారు. ఆ కబ్జాలు తొలగించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. చెరువు కబ్జా చేసి ఒవైసీ నిర్మించిన కాలేజీని కూలుస్తారా? అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ సఖ్యంగా ఉంటోందని విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఒవైసీ కాలేజీని కూలగొడతారా? అని మహేశ్వర రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ కామెంట్పై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. దయచేసి ఆ స్కూల్ కూల్చొద్దని కోరారు అక్బరుద్దీన్ ఒవైసీ. పేద విద్యార్థులకు ఆ పాఠశాల వరం లాంటిదన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వైరంతో తాము నిర్మించిన స్కూల్ కూల్చాలని కోరడం సరికాదన్నారు. వేలాది మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునే స్కూల్ నేలమట్టమైతే, వారి బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ కూల్చినా, కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తామన్నారు. 40 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందజేస్తున్నామన్నారు. విద్యార్ధులకు అందించే నైపుణ్యాలు, విద్యా బోధన కొందరిలో అసూయను రేకెతిస్తోందని ఆయన నొక్కిచెప్పారు.
హైడ్రాపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలో గల ఫాతిమా ఒవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై ఆయన స్పందించారు. చెరువు కబ్జా చేసి ఒవైసీ బ్రదర్స్ స్కూల్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఆక్రమంలో అక్బరుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించి, కత్తులతో దాడులు చేయండన్నారు. పేదల విద్యాభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిని అడ్డుకోవద్దని అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. ఆ స్కూల్ మాత్రం కూల్చకూడదన్నారు. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించామని, వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారన్నారు.
పాతబస్తీలో చెరువులు కబ్జాకు గురయ్యాయని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి గుర్తుచేశారు. ఆ కబ్జాలు తొలగించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. చెరువు కబ్జా చేసి ఒవైసీ నిర్మించిన కాలేజీని కూలుస్తారా? అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ సఖ్యంగా ఉంటోందని విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఒవైసీ కాలేజీని కూలగొడతారా? అని మహేశ్వర రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఈ కామెంట్పై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు.
దయచేసి ఆ స్కూల్ కూల్చొద్దని కోరారు అక్బరుద్దీన్ ఒవైసీ. పేద విద్యార్థులకు ఆ పాఠశాల వరం లాంటిదన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ వైరంతో తాము నిర్మించిన స్కూల్ కూల్చాలని కోరడం సరికాదన్నారు. వేలాది మంది విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునే స్కూల్ నేలమట్టమైతే, వారి బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ కూల్చినా, కుతుబ్ మీనార్ కంటే ఎత్తైన భవనాలు నిర్మిస్తామన్నారు. 40 వేల మంది విద్యార్థులకు ఉచిత విద్య అందజేస్తున్నామన్నారు. విద్యార్ధులకు అందించే నైపుణ్యాలు, విద్యా బోధన కొందరిలో అసూయను రేకెతిస్తోందని ఆయన నొక్కిచెప్పారు.
What's Your Reaction?