బఫర్ జోన్‌లో కాదు. చెరువులోనే నిర్మాణాలు చేపట్టారు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సినీ హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘బఫర్ జోన్‌లో కాదు. చెరువులోనే నిర్మాణాలు చేపట్టారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. కబ్జాలు, నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను ప్రజల ముందు ఉంచుతాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు. మరోవైపు N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. కాగా, ఈ తీర్పు వచ్చేలోపే కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు, సిబ్బంది నేలమట్టం చేశారు. అంతకుముందు N కన్వెన్షన్ కూల్చివేస్తున్నట్లు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని హీరో నాగార్జున పేర్కొన్నారు. కోర్టు వ్యతిరేకంగా తీర్పుఇస్తే తానే కూల్చివేసేవాడినన్నారు. ‘తాజా పరిణామాలతో మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చు. వారి అభిప్రాయాన్ని పోగొట్టేందుకు కోర్టును ఆశ్రయిస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

What's Your Reaction?