బీజేపీలో రామ్ మాధవ్ మళ్లీ యాక్టివ్.. కిషన్ రెడ్డితో సంయుక్తంగా జమ్మూకాశ్మీర్ బాధ్యతలు
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఆర్టికల్ 371 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ నియమించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కు బాధ్యతలు అప్పగించింది. గతంలో ఈ ఇద్దరు కూడా జమ్మూకాశ్మీర్లో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో వారి వైపే మొగ్గు చూపింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ కోసం ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో 24 సెగ్మెంట్లలో పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగుతుంది. నోటిఫికేషన్ జారీతో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలి విడతకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్ట్ 27 కాగా.. నామినేషన్ల పరిశీలన 28న జరుగనుంది. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ 30. మొదటి దశలో దక్షిణ కాశ్మీర్ లోయ లోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లలోను, జమ్మూ ప్రాంతంలోని ఎనిమిది సెగ్మెంట్లలోను పోలింగ్ జరుగుతుంది. కాశ్మీర్ లోయలో పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్ పోరా, జైనపోరా, షోపియస్, డిహెచ్ పోరా, కుల్గామ్, డేవ్సర్, దూరు, కొకెర్నాగ్ (ఎస్టి), అనంతనాగ్ పశ్చిమం, అనంతనాగ్, శ్రిగుఫ్వారా బిజ్బెహరా, షాంగుస్, అనంత నాగ్ తూర్పు, పహల్గామ్ ఉన్నాయి. జమ్మూ ప్రాంతంలోని ఇందర్వాల్, కిష్ట్ వార్, పాద్దర్ నాగ్సేని, భదర్వాహ్, దోడా, దోడా పశ్చిమం, రాంబన్, బనిహాలకు ఎన్నికలు జరగనున్నాయి.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఆర్టికల్ 371 రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జ్ నియమించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కు బాధ్యతలు అప్పగించింది. గతంలో ఈ ఇద్దరు కూడా జమ్మూకాశ్మీర్లో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంతో వారి వైపే మొగ్గు చూపింది.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ కోసం ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో 24 సెగ్మెంట్లలో పోలింగ్ సెప్టెంబర్ 18న జరుగుతుంది.
నోటిఫికేషన్ జారీతో అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. తొలి విడతకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్ట్ 27 కాగా.. నామినేషన్ల పరిశీలన 28న జరుగనుంది. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ 30. మొదటి దశలో దక్షిణ కాశ్మీర్ లోయ లోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లలోను, జమ్మూ ప్రాంతంలోని ఎనిమిది సెగ్మెంట్లలోను పోలింగ్ జరుగుతుంది. కాశ్మీర్ లోయలో పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్ పోరా, జైనపోరా, షోపియస్, డిహెచ్ పోరా, కుల్గామ్, డేవ్సర్, దూరు, కొకెర్నాగ్ (ఎస్టి), అనంతనాగ్ పశ్చిమం, అనంతనాగ్, శ్రిగుఫ్వారా బిజ్బెహరా, షాంగుస్, అనంత నాగ్ తూర్పు, పహల్గామ్ ఉన్నాయి. జమ్మూ ప్రాంతంలోని ఇందర్వాల్, కిష్ట్ వార్, పాద్దర్ నాగ్సేని, భదర్వాహ్, దోడా, దోడా పశ్చిమం, రాంబన్, బనిహాలకు ఎన్నికలు జరగనున్నాయి.
What's Your Reaction?